బాహుబలి సెకండాఫ్ ముందే చూసేశారు! | theatre plays second half of baahubali-2 first accidentally | Sakshi
Sakshi News home page

బాహుబలి సెకండాఫ్ ముందే చూసేశారు!

Published Sat, Apr 29 2017 11:20 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలి సెకండాఫ్ ముందే చూసేశారు! - Sakshi

బాహుబలి సెకండాఫ్ ముందే చూసేశారు!

బాహుబలి-2 సినిమా విడుదలైన తర్వాత కష్టపడి టికెట్ సంపాదించుకున్నారు.. ఎంచక్కా థియేటర్‌కు వెళ్లారు. అక్కడ సినిమా చూస్తుంటే ఫస్టాఫ్‌లోనే బ్రహ్మాండమైన వార్ సీక్వెన్సులు కనిపిస్తున్నాయి. అబ్బో ఫస్టాఫే ఇలా ఉందంటే సెకండాఫ్‌లో ఇంకెన్ని యుద్ధాలు ఉంటాయో, అది ఇంకెంత అదిరిపోతుందో అని చూశారు. ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా అనుమానం వచ్చింది. ఎక్కడో తేడా కొట్టినట్లుందే అనుకున్నారు. తీరా క్లైమాక్స్ దగ్గర అసలు విషయం తెలిసింది. ఏమిటంటే, సినిమాలో ఫస్టాఫ్ ముందు చూపించడానికి బదులు సెకండాఫ్ ముందు చూపించి, దాని తర్వాత ఫస్టాఫ్ ప్లే చేశారు. ఈ గందరగోళం బెంగళూరులోని పీవీఆర్ ఎరీనా మాల్‌లో జరిగింది.

దాంతో ప్రేక్షకులకు ఒళ్లు మండిపోయింది. మొత్తం సినిమా మళ్లీ మొదట్నుంచి వేయాలంటూ పట్టుబట్టారు. అయితే అప్పటికే తర్వాతి షో ప్రేక్షకులు వచ్చేయడంతో ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఈ విషయం గురించి ట్విట్టర్‌లో పుంఖానుపుంఖాలుగా రాసి పారేశారు. తాను గత రాత్రి పీవీఆర్ ఎరీనా మాల్‌లో బాహుబలి సినిమాకు వెళ్లానని, అక్కడి వాళ్లు ముందు సెకండాఫ్ సినిమా చూపించారని, ప్రేక్షకులకు క్లైమాక్స్ సమయంలోనే అసలు విషయం తెలిసిందని అన్నారు. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా అయితే 9వేల స్క్రీన్లలో విడుదలైంది. బాక్సాఫీసులో కూడా ఇది రికార్డులు బద్దలు కొడుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement