– అమితాబ్
‘‘కల్కి 2898 ఏడీ’ సెట్స్‌లో తొలిసారి అమితాబ్ బచ్చన్‌గారిని కలిసినప్పుడు ఆయన కాళ్లను తాకాలనుకున్నాను. అమితాబ్‌గారు వద్దన్నారు. నువ్వు చేస్తే నేనూ చేయాల్సి ఉంటుందన్నారు. సార్... ప్లీజ్ అన్నాను. అప్పట్లో ఎవరైనా టాల్‌గా ఉంటే అమితాబ్ అనేవారు. అమితాబ్ బచ్చన్‌గారి హెయిర్ స్టయిల్ బాగా ఫేమస్. ఇక ‘సాగర సంగమం’ చూసి ఆ సినిమాలో కమల్‌గారిలా డ్రెస్ కావాలని మా అమ్మతో అన్నాను.
‘ఇంద్రుడు చంద్రుడు’లో ఆయన నటన చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టార్స్, దీపికా పదుకోన్‌తో కలిసి యాక్ట్ చేయడం నాకో మంచి ఎక్స్‌పీరియన్స్’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్‌ను అమితాబ్ బచ్చన్‌కు అశ్వినీదత్ అందించగా, ఆయన నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్‌ను ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అని అమితాబ్‌ను రానా అడగ్గా, మై బద్రర్ కమల్‌హాసన్‌కి అని చె΄్పారు. ఆ తర్వాత ఈ టికెట్‌ను అమితాబ్ నుంచి కమల్ అందుకుని, ‘షోలే’ సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇంకా ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేనిప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు అతను ఏం తాగితే ఇలాంటి ఐడియా వచ్చిందా అనిపించింది. తన విజన్ అద్భుతం. అశ్వినీదత్‌గారు సింపుల్‌గా ఉంటారు. సెట్స్‌లో నాకు కోపరేటివ్‌గా ఉన్నారు’’ అన్నారు.
కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా స్టార్ట్ చేసేప్పుడు ఆసక్తిగా అనిపించింది. సెట్స్‌లో పాల్గొన్న తర్వాత సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోంది. సాధారణంగా కనిపించేవారు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ విషయంలో నాకు అదే అనిపించింది. బ్యాట్‌మేన్‌లాంటి కథలు చేయాలని నాకు ఉండేది. ఈ సినిమాలో చేశాను.
ఈ సినిమాలో నేనొక పాత్ర చేయాలనుకున్నా.. ఈ పాత్రను అమిత్‌జీ చేస్తున్నారన్నారు. మరో పాత్ర ఎంచుకున్నా.. అది ప్రభాస్ చేస్తున్నారన్నారు. ఫైనల్‌గా సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘కరోనా టైమ్‌లో జూమ్‌లో నాగ్ అశ్విన్ కథ చె΄్పారు. తన విజన్ క్లియర్‌గా ఉంటుంది. ఇందులో తల్లి పాత్ర చేశాను. ఈ సినిమా సెట్స్‌లో ప్రభాస్ ఈ రోజు ఎవరికి ఏం ఫుడ్ పెట్టారు అన్నదే హైలైట్ డిస్కషన్‌గా ఉండేది (సరదాగా)’’ అన్నారు దీపికా పదుకోన్.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వేడుకకు హాజరు కాలేదు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో బైట్‌ను ప్లే చేశారు. కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చెప్పి, ఈ ప్రపంచాల నేపథ్యాలను వివరించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్వ΄్నాదత్, ప్రియాంకా దత్, అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికా పదుకోన్ స్టేజ్ నుంచి దిగేటప్పుడు ప్రభాస్, స్టేజ్ ఎక్కేటప్పుడు అమితాబ్ హెల్ప్ చేయడం ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment