Prabhas 'Project K' Beats RRR and Bahubali Records: Rana Daggubati - Sakshi
Sakshi News home page

Prabhas Project K: ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి రికార్డులు  బద్దలే: రానా

Published Fri, Jun 2 2023 1:00 PM | Last Updated on Fri, Jun 2 2023 1:15 PM

Rana Daggubati Says Prabhas Project Beat RRR and Bahubali Records - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, దీపికా పదుకొణే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్‌ -కె. ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మల్టీటాలెంటెడ్‌ నటుడు కమల్‌ హాసన్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో రానా చేసిన వ్యాఖ్యలు ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో ఓ లుక్కేద్దాం.

(ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!)

రానా మాట్లాడుతూ.. 'మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట్‌-కె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తప్పకుండా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది.  బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఉన్నా. ఈ టాలీవుడ్ మూవీ గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. టాలీవుడ్‌లో ఒక హీరో సినిమాను మరొక హీరో సపోర్ట్‌  చేయడం చాలా గొప్ప విషయం. ఇండియా సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని ఎంతో గౌరవిస్తున్నాయి. అలాగే మంచి కథతో వచ్చిన సినిమాకు ఎక్కడైనా ఆదరిస్తారు.' అని అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

(ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement