400 నాటౌట్..! | 400 crores and still counting, baahubali hindi version all time record | Sakshi
Sakshi News home page

400 నాటౌట్..!

Published Sat, May 13 2017 5:06 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

400 నాటౌట్..!

400 నాటౌట్..!

ఒకవైపు అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ బాలీవుడ్ హీరో నటించిన సర్కార్-3 సినిమా విడుదలైంది. మరోవైపు ఆయుష్మాన్ ఖురానా, పరిణీతి చోప్రా జంటగా నటించిన మేరీ ప్యారీ బిందు కూడా విడుదలైంది. శుక్రవారం నాడు విడుదలైన స్ట్రెయిట్ హిందీ సినిమాలు రెండు ఉండగా, ఆ రెండింటి కలెక్షన్లు కలిపి చూసినా, బాహుబలి మూడో శుక్రవారం సాధించిన కలెక్షన్ల కంటే తక్కువగానే ఉన్నాయట! ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఒక్క హిందీ వెర్షనే 400 కోట్ల నెట్ కలెక్షన్లు దాటిపోయింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ డబ్బింగ్ హక్కులు, ప్రచార ఖర్చు కలిపి కూడా కరణ్ జోహార్ పెట్టింది మొత్తం 90 కోట్లే. ఇప్పుడు 400 కోట్లకు పైగా కలెక్షన్ రావడంతో ఆయన పంట పండినట్లయింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితర దిగ్గజాలు నటించిన ఈ సినిమా ఇంకా మరెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement