అతను దొరికితే ఈపాటికి త్రిష పెళ్లయ్యేది! | I still believe in marriage, but I need to meet my kind of man: Trisha | Sakshi
Sakshi News home page

అతను దొరికితే ఈపాటికి త్రిష పెళ్లయ్యేది!

Published Wed, Jul 1 2015 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

అతను దొరికితే ఈపాటికి త్రిష పెళ్లయ్యేది!

అతను దొరికితే ఈపాటికి త్రిష పెళ్లయ్యేది!

‘‘సమాజం కోసం ఎవరూ పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుని బాధపడేవాళ్లను నేను చాలామందిని చూస్తున్నాను. అందుకే, ఇతరుల కోసం కాకుండా మనకు నిజంగా మంచి తోడు దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలి’’ అని త్రిష అంటున్నారు. వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగిన విషయం, అది బ్రేక్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి మీద మీకు ఏమైనా అపనమ్మకం ఏర్పడిందా? అనే ప్రశ్న త్రిష ముందుంచితే -‘‘వివాహ వ్యవస్థ మీద నూటికి నూరుపాళ్ళు నమ్మకం ఉంది. అయితే, వయసు మీద పడుతోందనో, ఇతరులు ఏమైనా అనుకుంటారనో పెళ్లి చేసుకోకూడదు. అసలు పెళ్లికి వయసుతో సంబంధం లేదు.
 
 మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ నా పాతికేళ్ల వయసులో నా లాంటి వ్యక్తి దొరికి ఉంటే.. అప్పుడు నిక్షేపంగా అతన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఈపాటికి నాకు పెళ్లయ్యుండేది’’ అని చెప్పారు. మీ నిశ్చితార్థం రద్దు కావడానికి అసలైన కారణాలు? అని త్రిషను అడిగితే -‘‘కారణాలదేముంది? ఎన్నయినా చెప్పచ్చు. కానీ, కొంతమంది గురించి చెప్పాల్సి వస్తుంది. నాకది ఇష్టం లేదు. నా జీవితంలో ఏం జరిగినా సమాధానం చెప్పాల్సింది మా అమ్మగారికే. ఏది ఏమైనా అమ్మ, నేను మొత్తం మా కుటుంబం ఆనందంగా ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement