త్రిష ఇల్లన్నా బిందుమాధవి | Bindu Madhavi is dating Trisha's Ex | Sakshi
Sakshi News home page

త్రిష ఇల్లన్నా బిందుమాధవి

Published Sat, Jan 28 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

త్రిష ఇల్లన్నా బిందుమాధవి

త్రిష ఇల్లన్నా బిందుమాధవి

త్రిష లేకుంటే నయనతార (త్రిష ఇల్లన్నా నయనతార) అన్న సినిమా టైటిల్‌ విన్నాం. ఇదేంటి త్రిష లేకుంటే బిందుమాధవి అంటున్నారు అన్నదేగా మీ సందేహం. ఇంతకు ముందు మీరు విన్నది రీల్‌ కథ. ఇది రియల్‌ కహానీ. నటి త్రిష నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్ ల రియల్‌ ప్రేమ భాగోతం అందరికీ తెలిసిందే. వారి ప్రేమ నిశ్చితార్థం వరకూ వెళ్లి పెళ్లి పీటలెక్కలేకబోయింది. అయితే పెళ్లికి ముందే వరుణ్‌ మణియన్ తో త్రిష ప్రత్కేక విమానంలో విహారయాత్ర పేరుతో వెళ్లి ఆగ్రాలో ప్రేమికుల చిహ్నంగా భావించే తాజ్‌మహాల్‌ ప్రాంతాలను చుట్టి ఎంజాయ్‌ చేసొచ్చిన విషయం తెలిసిందే.

అయితే వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పాలన్న వరుణ్‌మణియన్  షరతు ఆమోదనీయంగా లేక పోవడంతో త్రిష ఆయనతో పెళ్లిని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రేమ కథ ముగిసి ఏడాది దాటిందో లేదో నిర్మాత వరుణ్‌మణియన్  గురించి మరో ప్రేమ కథ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సారి నటి త్రిషకు బదులు నటి బిందుమాధవి ఆయనతో చేరారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, కళుగు, దేసింగ్‌రాజా, జాక్సన్ దురై తమిళ చిత్రాల్లో నటించిన బిందుమాధవి తెలుగమ్మాయన్నది తెలిసిన విషయమే.

ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేని ఈ బ్యూటీ నిర్మాత వరుణ్‌మణియన్ తో కలిసి విహారయాత్రకు వెళ్లి షికార్లు కొట్టొచ్చారు. ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసి, ఆనక వెంటనే డెలిట్‌ చేశారు.అయినా జరగాల్సిందేదో జరిగిపోయింది. నటి బిందుమాధవి, వరుణ్‌మణియన్ ల సన్నిహిత ఫొటో దృశ్యాలిప్పుడు సోషల్‌మీడియాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి వీరి విహారకథ ఏ మలుపు తిçరుగుతుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement