మమ్ముట్టి సరసన త్రిష | Mammootty with Trisha | Sakshi
Sakshi News home page

మమ్ముట్టి సరసన త్రిష

Published Sun, Aug 16 2015 3:49 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

మమ్ముట్టి సరసన త్రిష - Sakshi

మమ్ముట్టి సరసన త్రిష

నటి త్రిషకు వరుణ్‌మణియన్ పెళ్లి మాత్రమే బెడిసికొట్టింది కానీ ఇతర అన్ని విషయాల్లోనూ భేష్‌గా వర్కౌట్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే వరుణ్‌మణియన్‌తో ప్రేమకు ముందు ఆ తరువాత అని కూడికలు వేస్తే నటిగా ఆ తరువాతే నట జీవితం బ్రైట్ అయిందని చెప్పవచ్చు. అంతకు ముందు ఒకటి అరా చిత్రాలతో నెట్టుకొస్తున్న త్రిషకు వరుణ్‌మణియన్‌తో సన్నిహిత సంబంధాలు పెరిగిన తరువాతే ఐదారు అవకాశాల్లో బిజీ అయ్యారు.

ఇకపోతే తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్ ఆశను తీర్చుకున్నారు. అలాగే దక్షిణాది భాషల్లో ఒకటైన కన్నడంలోనూ శివరాజ్‌కుమార్ సరసన పవర్ చిత్రంలో నటించి అక్కడి ప్రేక్షకులను అలరించి తన ముచ్చట తీర్చుకున్నారు. ఇక దక్షిణాదిలో మిగిలింది మలయాళ సినిమా. ఇప్పుడా ఆశ తీరబోతోందని సమాచారం. అవును మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో రోమాన్స్‌కు త్రిష రెడీ అయ్యే సమయం ఆసన్నమైందట. ఆయనతో వైట్ అనే చిత్రంలో నటించే విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నది కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి ఉదయ్‌ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు.

మలయాళ చిత్రపరిశ్రమలోకి కూడా ఎంట్రీ అయితే ఓ పనైపోద్ది అని అనుకుంటున్న త్రిష మమ్ముట్టితో మాలీవుడ్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇంతకీ ఈమెకు ఆ చిత్రంలో నటించమని సూచించిందెవరో తెలుసా?త్రిష తన ప్రియ నేస్తంగా భావించే నటి నయనతార అట. ఈమె ఇంతకు ముందు భాస్కర్ ది రాస్కెల్ చిత్రంలో మ మ్ముట్టితో జతకట్టారన్నది గమనార్హం. ఇక త్రిష ప్రస్తుతం కమలహాసన్‌కు జంటగా తూంగావనం చిత్రాన్ని పూర్తి చేసి,సుందర్.సి దర్శకత్వలో అరణ్మణి-2 చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement