ఉత్కంఠ రేపే భద్రమ్
ఉత్కంఠ రేపే భద్రమ్
Published Sun, Mar 2 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
‘‘వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఒకటే ఉత్కంఠ. క్లైమాక్స్ దాకా కారణం అర్థం కాదు. ఊహించని మిస్టరీ. అందుకే కథకు తగ్గట్టు ‘భద్రమ్’ అని టైటిల్ పెట్టాం. కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్పడమే ఈ టైటిల్‌కి అర్థం’’ అని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రాన్ని ‘భద్రమ్’ పేరుతో పుష్యమి ఫిలింమేకర్స్ బి.శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రేయాస్ శ్రీను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ -‘‘సాంకేతికంగా సినిమా ఉన్నంతంగా ఉంటుంది. ప్రసన్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు.
Advertisement
Advertisement