మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Blue Star Movie Release In Three OTT Platforms | Sakshi
Sakshi News home page

OTT Movie: రియల్ లైఫ్ జోడీ తొలి సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Published Sat, Feb 24 2024 3:29 PM | Last Updated on Sat, Feb 24 2024 3:41 PM

Blue Star Movie Release In Three OTT Platforms - Sakshi

ఈ మధ్య సినిమాలన్నీ ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే చాలా తర్వగానే వచ్చేస్తున్నాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలానే ఓ హిట్ సినిమా కూడా దాదాపు నెలలోనే రిలీజ్ కానుంది. అయితే ఒకేసారి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుందనే విషయం ఆసక్తికరంగా మారిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా? స్ట్రీమింగ్ ఎప్పుడు?

(ఇదీ చదవండి: వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్‌లో విజయ్-రష్మిక)

జనవరి 25న తమిళంలో రిలీజైన సినిమా 'బ్లూ స్టార్'. క్రికెట్ నేపథ్యం ప్లస్ కులాల మధ్య అంతరాలు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. అశోక్ సెల్వన్, శంతను, కీర్తి పాండియన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ అయింది. కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

ఫిబ్రవరి 29 నుంచి ఓటీటీలో 'బ్లూ స్టార్' స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అయితే ఈ చిత్రం.. టెంట్ కోట్టా, సింప్లీ సౌత్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఇలా ఓ సినిమా ఏకంగా మూడు ఓటీటీల్లో రిలీజ్ కావడం కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కూడా ఉండొచ్చని టాక్. ఈ సినిమాలో నటించిన అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్.. గతేడాది సెప్టెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జంటగా తొలి మూవీతోనే హిట్ కొట్టేశారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement