హత్యలు చేస్తోందెవరు?
హత్యలు చేస్తోందెవరు?
Published Tue, Mar 18 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
విల్లా ఫేం అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేశ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తెగిడి’. ఈ చిత్రం ‘భద్రమ్’ పేరుతో ఈ నెల 21న తెలుగులో విడుదల కానుంది. శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిమ్ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళనాట గొప్ప విజయం సాధించిన సినిమా ఇదని రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘‘వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు? అనే ఉత్కంఠ భరిత కథాంశంతో ఈ చిత్రం రూపొందింది’’ అని శ్రేయాస్ శ్రీను తెలిపారు. ఇంకా సహ నిర్మాత డి.ఉమాదేవి, ఎస్‌కేఎన్‌లతోపాటు మల్టీ డైమన్షన్ వాసు, టి.ఆర్.సత్యనారాయణ, దశరథరామిరెడ్ది తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement