ప్రేమించా..కానీ! : హీరోయిన్‌ | Actress Janani Iyer Special Interview | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 19 2018 8:46 AM | Last Updated on Fri, Oct 19 2018 8:46 AM

Actress Janani Iyer Special Interview - Sakshi

ప్రేమించాను కానీ..! అంటోంది నటి జననీఅయ్యర్‌. 2009లోనే రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ నటిగా దశాబ్దానికి చేరువవుతోంది. అయితే బాలా దర్శకత్వంలో ఆర్యకు జంటగా నటించిన అవన్‌ ఇవన్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జననీఅయ్యర్‌ ఆ తరువాత పలు చిత్రాలు చేసినా ఇంకా మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇటీవల బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో–2లో కూడా పాల్గొని పాపులర్‌ అయిన ఈ అమ్మడితో చిన్న భేటీ.

నటిగా దశాబ్దానికి చేరువవుతున్నారు. సినిమాలో మీరు నేర్చుకున్నది.
సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో టైమ్‌ వస్తుంది. అప్పుడు వారి శ్రమ, నిరంత కృషి తెలుస్తుంది. అప్పటి వరకూ ఓర్పుగా వేచి ఉండాలి. ఇదే నేను నేర్చుకుంది.

ఎలాంటి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు?
నాకు నప్పే కథా పాత్ర అయి ఉండాలి. గ్లామర్‌ పాత్రలకు నేను నప్పుతానో లేదో తెలియదు గానీ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయేలా మంచి బలమైన కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. చారిత్రక కథా చిత్రాల్లోనూ నటించాలనే ఆశ ఉంది. భూత కాలంలోకి ఎలాగూ వెళ్లలేం, అలాంటి కథా చిత్రాల్లో నటించి ఆ అనుభవాన్ని పొందాలనుంది. జోదా అక్బర్‌ లాంటి రాణీ పాత్రల్లో నటించే అవకాశం వస్తే నటించాలని ఆశగా ఉంది.

సినిమాను వదిలి పోవాలని ఎప్పుడైనా అనిపించిందా?
అలాంటి ఆలోచనే రాలేదు. అయితే ఇంజినీరింగ్‌ చదివి నటివయ్యావెందుకని ఇంట్లో అనేవారు. అయితే నాకు నటన అంటే ఆసక్తి. వయసు మళ్లిన తరువాత కూడా ఈ రంగంలోనే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను.

ప్రస్తుతం మీటూ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. దీని గురించి మీ స్పందన?
జ: లైంగిక వేధింపులు అన్ని రంగాల్లోనూ జరుగుతున్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చాలా మంది ధైర్యంగా మాట్లాడుతున్నారు. నాకూ సంతోషంగా ఉంది. ఇదే సరైన సమయం. ఇప్పుడు మాట్లాడకపోతే చాలా విషయాలు వెలుగు చూడవు.

మీకు నచ్చిన విషయం?
ఇళయరాజా సంగీతాన్ని వింటూ ఒంటరిగా కారులో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లటం ఇష్టం

మీకు నచ్చిన హీరో?
నాకు అజిత్‌ అంటే చాలా ఇష్టం.

ఇష్టమైన దర్శకుడు?
బాలా, మణిరత్నం

మీ స్లిమ్‌ శరీర రహస్యం? 
పెద్దగా శిక్షణ అంటూ ఏమీ తీసుకోను. ఇంకా చెప్పాలంటే  కొవ్వు పదార్థాలను కూడా తినేస్తాను. అయినా బరువు పెరగను. అది నాకు దైవం ఇచ్చిన వరం.

మీకు అజిత్, విజయ్‌లతో నటించే అవకాశం ఒకేసారి వస్తే?
విజయ్‌ అభిమానులు క్షమించాలి. నేను అజిత్‌ చిత్రంలోనే నటిస్తాను.

ప్రేమలో పడ్డారా?
నేనూ ప్రేమించాను.అయితే ఇప్పుడెవరూ లేరు

రాజకీయాల్లోకి వస్తారా?
రాజకీయాలకు నేను చాలా దూరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement