మూండ్రాంపిరైలో శ్రీదేవిలా నటించా! | Balloon movie is released on September 27th | Sakshi
Sakshi News home page

మూండ్రాంపిరైలో శ్రీదేవిలా నటించా!

Aug 18 2017 3:18 AM | Updated on Sep 17 2017 5:38 PM

మూండ్రాంపిరైలో శ్రీదేవిలా నటించా!

మూండ్రాంపిరైలో శ్రీదేవిలా నటించా!

మూండ్రాం పిరై చిత్రంలో శ్రీదేవిలా నటించానని యువ నటి జననీఅయ్యర్‌ పేర్కొంది.

తమిళసినిమా: మూండ్రాం పిరై చిత్రంలో శ్రీదేవిలా నటించానని యువ నటి జననీఅయ్యర్‌ పేర్కొంది. జై, అంజలి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బెలూన్‌. ఇందులో మరో కథానాయకిగా జననీఅయ్యర్‌ నటిస్తోంది. 70ఎంఎం పతాకంపై సినీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌  27వ తేదీన విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు కథానాయికల్లో ఒకరుగా నటించిన నటి జననీఅయ్యర్‌ తన పాత్ర గురించి తెలుపుతూ 1980లో వచ్చిన మూండ్రాంపిరై చిత్రాన్ని, అందులో నటి శ్రీదేవి గతాన్ని మరచిపోయి అమాయకపు అమ్మాయిగా నటించిన పాత్రను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.

అయితే శ్రీదేవిలా నటించడం ఎవరికీ సాధ్యం కాదని, బెలూన్‌ చిత్రంలో తన పాత్ర ఆ తరహాలో ఉంటుందని చెప్పింది. శ్రీదేవి సాటిగా నటించడం సాధ్యం కాదని చిత్ర దర్శకుడు తాను, ఇతర చిత్ర యూనిట్‌ భావించామని, అయితే ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు శిరిష్‌ తనను నటింపజేశారని చెప్పింది. ఇందులో తన నటన తనకే ఆశ్చర్యం కలిగించిందని అంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని అంజలి వ్యక్తం చేసింది. తాను ఇప్పటి వరకూ చేసిన పాత్రల్లో ఈ తరహా పాత్రను చేయలేదని, తనకు బెలూన్‌ చిత్రం ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ఈ చిత్ర విడుదల హక్కుల్ని ఆరా సినిమా సంస్థ కొనుకోలు చేయడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement