అంజలి ఏంటి.. అలా అనేశారు! | Anjali speaks about marriage and career | Sakshi
Sakshi News home page

అంజలి ఏంటి.. అలా అనేశారు!

Published Sat, Sep 9 2017 7:33 PM | Last Updated on Tue, Sep 19 2017 12:13 PM

అంజలి ఏంటి.. అలా అనేశారు!

అంజలి ఏంటి.. అలా అనేశారు!

చెన్నై: ‘నాకు నచ్చినోడు ఇంకా కంటపడలేదు’ అంటూ నటి అంజలి షాక్‌ ఇచ్చారు. ఇది ఎవరికి షాకవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంజలి సినీ కేరీర్‌ను ప్రారంభించి చాలా ఏళ్లే అయింది. తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణలాంటి ప్రముఖ హీరోలతో జత కట్టినా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను తెచ్చుకోలేదు. ఇక కోలీవుడ్‌లో అది కూడా లేదు. ఇప్పటికీ స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు లేవు. ఇప్పుడు మలయాళంలోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. నటిగా ఇలా ఉంటే అంజలి చాలాసార్లు వదంతుల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా నటుడు జైతో ప్రేమ, షికార్లు అంటూ ప్రచారం జోరుగానే జరిగింది.

ఆ మధ్య జై తన స్వహస్తాలతో దోసెలు వేసిపెడితే లొట్టలేసుకుంటూ తిని ఆయనలో మంచి నలభీముడున్నాడంటూ కితాబిచ్చేశారు. అంతేకాదు జై పుట్టినరోజు వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొని సందడి చేశారు. ఇక నటుడు జై, అంజలి పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. తాజాగా నటి అంజలి తనకు నచ్చినోడు ఇంకా తారసపడలేదనీ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అంజలి మాట్లాడూతూ.. తన సినీ పయనం హ్యాపీగా సాగుతోందని.. కాబట్టి ప్రేమ, పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించే తీరిక లేదన్నారు. మనసుకు నచ్చినోడు ఇంకా తారస పడలేదని, అలాంటోడు ఎదురైతే ఆ విషయాన్ని వెంటనే చెప్పేస్తా అన్నారు. తనను పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు జై అన్నట్లు తనకు తెలియదన్నారు.

ఇక తమ ఇద్దరిని కలుపుతూ చాలానే ప్రచారం జరిగిందనీ, భవిష్యత్‌లో ఎం జరుగుతుందన్నది ఊహించలేమనీ పేర్కొంది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుందనే వేదాంతాన్ని వల్లించింది. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ను చూసినంత మాత్రానా వెంటనే అంజలి రాజకీయల్లోకి రానున్నట్లు ప్రచారం చేశారని, నిజానికి అలాంటి ఆలోచన తనకు లేదనీ అంజలి పేర్కొన్నారు. అంజలి, జై కలిసి నటించిన మూవీ 'బెలూన్‌' త్వరలో విడుదల కానుంది.
(చదవండి: నేనెప్పుడూ నీతోనే ఉంటా: హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement