ఎగరడానికి బెలూన్‌ రెడీ | The balloon film was released on September 27th | Sakshi
Sakshi News home page

ఎగరడానికి బెలూన్‌ రెడీ

Published Sun, Aug 13 2017 2:26 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

ఎగరడానికి బెలూన్‌ రెడీ

ఎగరడానికి బెలూన్‌ రెడీ

తమిళసినిమా:  బెలూన్‌ చిత్రం థియేటర్లలో ఎగరడానికి రెడీ అంటోంది. కోలీవుడ్‌లో చాలా కాలంగా వార్తల్లో ఉన్న ప్రేమ జంటల్లో నటుడు జై, నటి అంజలి ఒకరు. ఈ జంట చాలాకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారని, ఇప్పటికే సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారని, ఇలా వీరి గురించి బోలెడు కాలక్షేప వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అలాంటి జంట కలిసి నటిస్తున్న చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా చాలానే ఉంటుందని వేరే చెప్పాలా? అలాంటి చిత్రమే బెలూన్‌. 70 ఎంఎం, ఫార్మర్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సినీష్‌ దర్శకుడు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న బెలూన్‌ చిత్ర విడుదల హక్కులను ఆరా సంస్థ పొందింది. ఆ సంస్థ అధినేత మహేశ్‌ గోవిందన్‌ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ బెలూన్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల నుంచి మంచి క్రేజ్‌ను సంపాందించుకుందన్నారు.

చిత్ర టీజర్‌కు వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బెలూన్‌ చిత్రం విజయం సాధించడం తథ్యమనే నమ్మకం తమకు ఉందన్నారు. ఈ చిత్రం చూసే ప్రేక్షకులకు మంచి జాయ్‌తో కూడిన ఎంటర్‌టెయిన్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందన్నారు. తమ ఆరా సంస్థలో బెలూన్‌ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందని మహేశ్‌ గోవిందన్‌ పేర్కొన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న పండగ రోజుల్లో విడుదల చేయనున్నామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement