స్టార్‌ హోదా పొందాలనుకుంటున్నా.. | actress anjali compleat her 10years in film industry | Sakshi
Sakshi News home page

దశాంజలి..!

Dec 25 2017 9:43 AM | Updated on Dec 25 2017 9:43 AM

actress anjali compleat her 10years in film industry - Sakshi

తమిళసినిమా: అంజలి నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. కథానాయకిగా పదేళ్లకు పైగా రాణించడం అంత సులభం కాదు. ఏడాదికి వందల సంఖ్యలో కొత్త హీరోయిన్లు కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. వారిలో ప్రతిభను చాటుకుని స్టార్‌ నాయకి స్థాయిని అందుకున్న వారు చాలా తక్కువేనని చెప్పక తప్పదు. అలాంటి వారిలో నటి అంజలి ఒకరు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి కథానాయకిగా గుర్తింపు పొంది బహు భాషా నటిగా రాణిస్తున్న అంజలి మొదట తెలుగులో పరిచయం అయినా, విజయాన్ని అందుకుంది మాత్రం తమిళ చిత్రపరిశ్రమలోనే. అంగాడితెరు, ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రాల్లో అంజలి నటనను ప్రశంసించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ బ్యూటీ నటించిన తాజాగా చిత్రం బెలూన్‌ ఈ నెల 29న తెరపైకి రానుంది.

ఇందులో స్పెషల్‌ ఏమిటంటే ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న నటుడు జై తో కలిసి నటించడం. యువ దర్శకుడు సినీష్‌ తెరక్కెంచిన ఈ చిత్రంలో నటి జననీఅయ్యర్‌ మరో హీరోయిన్‌గా నటించింది. ఇందులో నటించడంపై అంజలి తెలుపుతూ తనకు దెయ్యం కథా చిత్రాలంటే ఇష్టం అని, అంతేగాకుండా కథ, హర్రర్‌ సన్నివేశాలు ఆసక్తిని కలిగించాయని తెలిపారు. హర్రర్‌తో పాటు ప్రేమ, వినోదం అంటూ అందర్ని అలరించే చిత్రంగా ఉంటుందని చెప్పారు.  జై ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిపారు. తాను నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్నానని, అయితే నటిగా స్టార్‌ హోదా పొందాలని ఆశిస్తున్నట్టు అంజలి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement