జైకి అంజలి షాక్‌ | Anjali surprises Jai on his birthday | Sakshi
Sakshi News home page

జైకి అంజలి షాక్‌

Published Mon, Apr 10 2017 6:13 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

జైకి అంజలి షాక్‌

జైకి అంజలి షాక్‌

సంచలన నటి అంజలి నటుడు జైకి షాక్‌ ఇచ్చారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్న ప్రచారం ఇంకాస్త ముందుకెళ్లి సహజీవనం చేస్తున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య జై తన ప్రియురాలికి స్వయంగా కమ్మని దోసెలను వేసి పెట్టి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వారి ఘాటు ప్రేమను ప్రపంచానికి తెలిపారు. చాలా కాలం తరువాత ఈ జంట బెలూన్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో తన సన్నివేశాలను పూర్తి చేసుకుని వేరే తెలుగు చిత్రానికి నటి అంజిలి వెళ్లిపోయారు. ఇటీవల బెలూన్‌ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లో నటుడు జై తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. చిత్ర యూనిట్‌ జై కోసం కేక్‌ను హెలీకామ్‌ క్రేన్‌లో తీసుకొచ్చి షాక్‌ ఇవ్వగా ఆ వేడుకకు అనూహ్యంగా వచ్చి ఆయనకు తీయని షాక్‌ ఇచ్చారు నటి అంజలి. అంతటితో ఆగలేదు. తను జైతో సన్నిహితంగా ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మైడియర్‌ జై మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ మనోభావాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను. ఎప్పటిలానే ప్రేమ కలిగిన వారిగానే ఉండండి అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement