హర్రర్, థ్రిల్లర్‌గా బెలూన్‌ | jai, anjali, Jai movie balloon. He is Anjali, Jananiyaayar is new movie beloon | Sakshi
Sakshi News home page

హర్రర్, థ్రిల్లర్‌గా బెలూన్‌

Published Wed, Jun 21 2017 3:19 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

హర్రర్, థ్రిల్లర్‌గా బెలూన్‌

హర్రర్, థ్రిల్లర్‌గా బెలూన్‌

తమిళసినిమా: లవ్, హర్రర్‌ థ్రిల్లర్‌గా తెరపైకి రావడానికి బెలూన్‌ చిత్రం ముస్తాబవుతోంది. యువ నటుడు జై తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం బెలూన్‌. ఆయనకు జంటగా అంజలి, జననీఅయ్యర్‌ నటిస్తున్న ఇందులో యోగిబాబు, నాగినీడు, నందకుమార్, జాయ్‌ మ్యాథ్యు, రామచంద్రన్, కార్తీక్‌యోగి, మోనిక, రిషి ముఖ్య పాత్రలు పోషించారు.

70 ఎంఎం.ఎంటర్‌టెయిన్‌మెంట్, ఫార్మర్స్‌ మాస్టర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థల అధినేతలు దిలీప్‌సుబ్బరాయన్, అరుణ్‌బాలాజీ, నందకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం బెలూన్‌. నవ దర్శకుడు శ్రీనిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర టీజర్‌ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీనిష్‌ మాట్లాడుతూ హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాలకు ప్రత్యేక ఆదరణ లభిస్తోందన్నారు.

ఆ తరహాలో తెరకెక్కించిన విభిన్న థ్రిల్లర్‌తో కూడిన లవ్, కామెడీ కథా చిత్రం బెలూన్‌ అని తెలిపారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న జై తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ రావడం సంతోషంగా ఉందని అన్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్ల డించారు. ప్రేమికులుగా ముద్ర పడ్డ జై, అంజలి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో బెలూన్‌పై ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement