బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీకి బెయిల్!
బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీకి బెయిల్!
Published Fri, May 23 2014 5:47 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
ముంబై: మాజీ ప్రియురాలిపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీకి ముంబైలోని స్థానిక సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తును పమర్పించాం. శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలవుతారు అని అంకిత్ తరపు న్యాయవాది నీరజ్ గుప్తా వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదుపై అత్యాచారం కేసులో మే 8 తేదిన అంకిత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి మే 12 తేది వరకు పోలీస్ కస్టడీ విధించారు. ఆతర్వాత అంకిత్ కు మే 26 తేది వరకు జుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో అంకిత్ తివారీ సోదరుడు కూడ అరెస్టయ్యాడు. ఆషికీ-2 చిత్రంలోని సున్ రహ హై తు అనే పాటతో సంగీత అభిమానుల ఆదరణను పొందాడు.
Advertisement
Advertisement