హిందీ చిత్రాన్ని మించేలా... | Nee Jathaga Nenudali's trailer launched | Sakshi
Sakshi News home page

హిందీ చిత్రాన్ని మించేలా...

Published Sun, Jun 8 2014 10:20 PM | Last Updated on Sat, Oct 20 2018 5:33 PM

హిందీ చిత్రాన్ని మించేలా... - Sakshi

హిందీ చిత్రాన్ని మించేలా...

హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషికీ 2’ తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె. జయ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ - ‘‘హిందీ ‘ఆషికీ 2’కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాని మించేలా ఈ సినిమా ఉండేట్లు దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
 
  ‘ఎవడు’లోని ‘నీ జతగా నేనుండాలి...’ పాటే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టాం. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కాబట్టి, ఈ టైటిలే బాగుంటుంది. నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో షెడ్యూల్ పూర్తి చేసి, 16న పోలండ్ వెళ్లి అక్కడ ఓ పాట, ఫైట్ చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుంది’’ అని చెప్పారు. సచిన్, నజియా సహజమైన నటన కనబరుస్తున్నారని, హిందీ సినిమాని మించే స్థాయిలో ఉండాలనే పట్టుదలతో చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. సచిన్ మాట్లాడుతూ - ‘‘మాతృక కన్నా ఈ సినిమా బాగా వస్తోంది. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రానికి జీత్ గంగూలి, మిథున్, అంకిత్ మంచి పాటలు స్వరపరిచారు’’ అన్నారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని నజియా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement