నేకెడ్‌ గన్‌ రీమేక్‌లో... | Pamela Anderson joins Liam Neeson for Naked Gun remake | Sakshi
Sakshi News home page

నేకెడ్‌ గన్‌ రీమేక్‌లో...

Published Thu, Apr 18 2024 1:54 AM | Last Updated on Thu, Apr 18 2024 1:54 AM

Pamela Anderson joins Liam Neeson for Naked Gun remake - Sakshi

హాలీవుడ్‌ హాట్‌ తార పమేలా ఆండర్సన్‌ అభిమానులకు ఓ శుభవార్త. ఈ గ్లామరస్‌ స్టార్‌ తాజాగా ‘నేకెడ్‌ గన్‌’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో పమేలా పాత్ర నిడివి ఎక్కువ కావడం, హీరోయిన్‌ పాత్ర కావడం అనేది అభిమానులు ఆనందించే విషయమే. 1980 చివర్లలో 1990 ఆరంభంలో వచ్చిన క్రైమ్‌ కామెడీ ‘నేకెడ్‌ గన్‌’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మూడో భాగం 1994లో వచ్చింది. 30 ఏళ్లకు ‘నేకెడ్‌ గన్‌’ మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అకీవా షాఫర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రీమేక్‌లో లీడ్‌ రోల్‌లో లియామ్‌ నీసన్‌ నటించనుండగా, అతని సరసన పమేలా ఆండర్సన్‌ నటించనున్నారు. గత మూడు భాగాల్లో డిటెక్టివ్‌ పాత్రను లెస్‌లీ నీల్సన్‌ చేయగా అతని ప్రేయసిగా ప్రిసిల్లా ప్రెస్లీ నటించారు. రీమేక్‌లో డిటెక్టివ్‌గా లియామ్‌ నీసన్, అతని ప్రేయసిగా పమేలా ఆండర్సన్‌ నటించనున్నారు.

వచ్చే ఏడాది జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక పమేలా గురించి చె΄్పాలంటే... 1990లలో హాటెస్ట్‌ స్టార్‌ అంటే పమేలానే. ‘ప్లే బాయ్‌’ మ్యాగజీన్‌ మోడల్‌గా అప్పట్లో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారామె. అలాగే బుల్లితెర కోసం ‘బేవాచ్‌’ సిరీస్‌ (1992–1997)లో చేసిన సీజే పార్కర్‌ పాత్ర కూడా హాట్‌ స్టార్‌గా పమేలాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాల పరంగా ‘రా జస్టిస్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్‌’ వంటివి పమేలా క్రేజ్‌ కొనసాగడానికి ఉపయోగపడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement