‘ఆషికి-2’ చేయడానికి ముందు భయపడ్డాను | scared before to 'aashiqui -2' | Sakshi
Sakshi News home page

‘ఆషికి-2’ చేయడానికి ముందు భయపడ్డాను

Published Wed, Aug 6 2014 11:15 PM | Last Updated on Sat, Oct 20 2018 5:33 PM

‘ఆషికి-2’ చేయడానికి ముందు భయపడ్డాను - Sakshi

‘ఆషికి-2’ చేయడానికి ముందు భయపడ్డాను

గత ఏడాది హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘ఆషికి 2’ ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ పేరుతో సచిన్ జోషి, నాజియా జంటగా జయరవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేశ్ పునర్నిర్మించారు. నేడు సచిన్ జోషి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన మనోభావాలు పంచుకుంటూ -‘‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. కొంత విరామం తర్వాత తెలుగులో చేసే సినిమా అద్భుతంగా ఉండాలని, ‘ఆషికి-2’ వంటి క్యూట్ లవ్‌స్టోరీ అయితే బాగుంటుందని ఈ రీమేక్‌లో నటించాలనుకున్నాను.

ఇందులో హీరో ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. ముందు ఈ పాత్ర చేయడానికి కొంచెం భయపడ్డాను. తెలుగుకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేశాం. ముఖ్యంగా క్లయిమాక్స్ ఊహించని మలుపుతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే పాటలు పెద్దలు హిట్టయ్యాయి. ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రం’’ అని చెప్పారు. ‘ఆషికి-2’ తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నాననీ, తెలుగులో ఓ హారర్, ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించనున్నానని సచిన్ తెలిపారు. అలాగే, థింక్ టాంక్ అనే సంస్థను ప్రారంభించి, లఘు చిత్రాలతో పాటు అన్ని రకాల సినిమాలు తీయాలని ఉందని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement