'హాఫ్ గర్ల్ఫ్రెండ్' శ్రద్ధా | Shraddha Kapoor is the Half girl friend | Sakshi
Sakshi News home page

'హాఫ్ గర్ల్ఫ్రెండ్' శ్రద్ధా

Published Sat, Jan 2 2016 10:15 AM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

'హాఫ్ గర్ల్ఫ్రెండ్' శ్రద్ధా - Sakshi

'హాఫ్ గర్ల్ఫ్రెండ్' శ్రద్ధా

బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కొత్త సంవత్సరాన్ని బిజీ బిజీగా ప్రారంభించింది. ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న ఈ భామ, కొత్త ఏడాదిలో మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యింది. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్తో బాగీతో పాటు రాక్ ఆన్ సీక్వల్లో నటిస్తున్న శ్రద్ధా, ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో సౌత్ సూపర్ హిట్ సినిమా ఓకే బంగారం రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి అంగీకరించింది శ్రద్ధా. ఈ సినిమాతో పాటు తనకు ఆషికీ 2 సక్సెస్తో స్టార్ ఇమేజ్ అందించిన మోహిత్ సూరి దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాకు హాఫ్ గర్ల్ఫ్రెండ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫైనల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ, ఆషికీ 2లో కలిసి నటించిన ఆదిత్య రాయ్ కపూర్తోనే తెరను పంచుకోబోతుంది శ్రద్ధా కపూర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement