37 కార్లు, 4 ట్రక్కులతో భారీ యాక్షన్‌ సీన్స్‌ | High Action Scenes Shot For Prabhas Saaho In Abu Dhabi | Sakshi
Sakshi News home page

Published Mon, May 21 2018 2:08 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

High Action Scenes Shot For Prabhas Saaho In Abu Dhabi - Sakshi

బాహుబలితో ఇండియన్‌ స్టార్‌ అయ్యారు ప్రభాస్‌. ఈ సినిమాతో ప్రభాస్‌ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న సాహో మూవీని హాలీవుడ్‌ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉన్నా... నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ఓ షెడ్యుల్‌ కోసం అబుదాబిలో ఉంది చిత్రబృందం. ప్రస్తుతం అబుదాబిలో భారీ యాక్షన్‌ ఛేజింగ్‌​ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. 

దీనిలో భాగంగానే 37 కార్లను, 4 ట్రక్కులను వినియోగిస్తున్నారట. ఈ భారీ చేజింగ్‌ సన్నివేశాలు హాలివుడ్‌ తరహాలో ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement