Aditya Roy Kapur
-
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
బాలీవుడ్లో మరో స్టార్ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో లవ్ బర్డ్స్‌గా ముద్ర వేసుకున్న జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. కొద్ది రోజులుగా వీరిద్దరు త్వరలోనే విడితునట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యం షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ జంట దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్ చేసుకున్నట్లు వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.గతంలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వీరిద్దరు హాజరయ్యారు. ఈ వేడుకల తర్వాత ఎక్కడా కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని ముంబయికి తిరిగి వచ్చాక తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతని తెలిపిన వివరాలప్రకారం మార్చిలోనే ఆదిత్య, అనన్య విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనన్య పాండే తన కొత్త పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కాగా.. అనన్య పాండే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ జంట రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. -
ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!
లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా నామమాత్రపు విజయాన్ని కూడా అందుకోలేదు. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ బ్యూటీ.. గంపెడాశలు పెట్టుకున్న లైగర్ కూడా ఫ్లాపవడంతో కొంత నిరాశచెందింది. అయినా సరే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ప్రస్తుతం అనన్య హిందీలో నాలుగు చిత్రాలు చేస్తోంది. ఇకపోతే డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో ఉండే అనన్య ఇటీవల బాయ్‌ఫ్రెండ్, నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఈ లవ్ బర్డ్స్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం రాత్రి షికారుకు వెళ్లారు. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుంది. వీరిని ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్‌మనిపించగా అనన్య తన ముఖాన్ని దాచేందుకు ప్రయత్నించింది. అయితే ఆదిత్య మాత్రం హాయిగా చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. 'వీరి జంట చూడచక్కగా ఉంది..', 'ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నట్లుగా ఉన్నారు', 'వీరి ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది, ఇంతదాకా వచ్చాక ఇంకా సిగ్గుపడటం దేనికి?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: కిడ్నీ ఫెయిల్.. బతకడం కష్టమనుకున్నా.. ఇంట్లో వాళ్లే పట్టించుకోలేదు: హీరోయిన్ ఒకానొక సమయంలో చనిపోదామనుకున్నా: జబర్దస్త్ వర్ష -
'ది నైట్ మేనేజర్'.. ఆ సీన్‌తో తమన్నాను మించిపోయిందిగా..!
గూఢచారి సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ శోభిత ధూళిపాల. మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శోభిత రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలోనూ నటించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్‌లపై దృష్టిపెట్టింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్-2'. ఈ సిరీస్ ఈనెల 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. (ఇది చదవండి: షూటింగ్లో కనీసం ఫుడ్ బిల్లు కూడా చెల్లించలేదు.. హీరోయిన్ ఆగ్రహం!) అయితే ఈ వెబ్ సిరీస్‌లో శోభిత మరింత బోల్డ్‌గా నటించినట్లు తెలుస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్‌తో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సీన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ఇది మరికొందరు రొమాంటిక్ సీన్స్‌లో శోభిత.. తమన్నాను మించి పోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. గతంలో శోభిత ధూళిపాల.. అక్కినేని నాగ చైతన్య డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ బ్రిటన్‌కు చెందిన సిరీస్ ఆధారంగా హిందీలో రీమేక్ చేశారు. సందీప్ మోడీ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, తిలోటమా షోమ్, శాశ్వత ఛటర్జీ, రవి బెహ్ల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) View this post on Instagram A post shared by SPARK EDITS and MEMES💥 (@priya_sparkedits) -
హీరోను ముద్దుపెట్టుకోబోయిన లేడీ ఫ్యాన్.. షాక్ అయిన నటుడు
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు వాళ్లతో ఒక్క ఫోటో అయినా దిగాలనుకుంటారు చాలామంది. ఇక అందులో తమ ఫెవరెట్ హీరో, హీరోయిన్లు కనిపిస్తే వాళ్ల ఆనందానికి అవధులుండవు. అయితే కొందరు తమ అభిమానాన్ని చూపించే క్రమంలో కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అసలే అతడికి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తాజాగా ఆయన నైట్ మేనేజర్ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. స్క్రీనింగ్ అనంతరం ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుండగా పలువురు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆదిత్య రాయ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగింది. ఫోటో దిగుతుండగానే హీరోను హగ్ చేసుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ చర్యతో షాక్ అయిన ఆదిత్య రాయ్ నవ్వుతూనే ఆమె చర్యను ప్రతిఘటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @varindertchawla -
ఆమెకు వీడ్కోలు.. శ్రద్ధాతో రొమాన్స్, చివరకు.. ఆదిత్య రాయ్ బ్రేకప్ స్టోరీ
ఆదిత్య రాయ్ కపూర్..సినిమా హీరోగా కన్నా ప్రేమికుడిగానే ఫేమస్. అతని విఫల ప్రేమ గాథే ఈ ‘మొహబ్బతే’లో... సిద్ధార్థ రాయ్ కపూర్ తమ్ముడిగా కాకుండా సొంత గుర్తింపుతోనే రాణిస్తున్నాడు ఆదిత్య రాయ్ కపూర్. అలాంటి ఐడెంటిటీ, సింప్లిసిటీ తోవలోనే నడుస్తున్న అహానా డియోల్ అంటే మనసు పడ్డాడు. అహానా ఎవరంటే.. ధర్మేంద్ర, హేమమాలినిల రెండో కూతురు. అమ్మ, నాన్న ఫేమ్‌తో కాకుండా స్వీయ ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం.. ప్రయత్నం ఆమెది. అందుకే సంజయ్ లీలాభన్సాలీ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ‘గుజారిష్’ సినిమాకు పనిచేయసాగింది. ఆ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ది కూడా ముఖ్య భూమిక. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరి ఆలోచన, ఆచరణ ఒకటే అవడంతో త్వరగానే స్నేహం కుదిరింది. ‘గుజారిష్’ విడుదలయ్యేలోపు ఆ ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. చెట్టపట్టాల్, చాటింగ్, అవుట్స్కట్స్లో హ్యాంగవుట్స్ ఈ లవ్ స్టోరీలోనూ షెడ్యూల్ అయ్యాయి. ఈ ప్రేమను ఆశీర్వదించే వాళ్లకంటే ఆ జంటను చూసి ఆందోళన చెందిన వాళ్లే ఎక్కువ.. అయ్యో.. చక్కటి కెరీర్‌ను ప్రేమ పాశంతో కట్టేసుకుంటున్నారే అని. అయినా నాలుగేళ్లు ఆ మోహంలో పడి కొట్టుకుపోయారిద్దరూ. అప్పుడు కలగజేసుకున్నారు ఇరువైపు పెద్దలు. పని మీదే దృష్టిపెట్టండని హెచ్చరించారు. లక్ష్యం గుర్తొచ్చింది ఇద్దరికీ. కలల్లోంచి బయటకు వచ్చారు. ఇద్దరి గమ్యం ఒకటే అయినా కలిసి చేయాల్సిన ప్రయాణం కాదని అర్థం చేసుకున్నారు. స్నేహపూర్వకంగానే వీడ్కోలు చెప్పుకున్నారు తమ ప్రేమకు. విడివిడిగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఆ బ్రేకప్ తర్వాత.. ఆదిత్య రాయ్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. శ్రద్ధా కపూర్‌తో. ‘ఆశికీ 2’ సినిమా సెట్స్ మీద. ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి సినిమా అది. ఆ జంట కెమిస్ట్రీకి బాక్సాఫీస్ బ్రహ్మరథం పట్టింది. ఆ సినిమా విషాదంతం కావడంతో బాధపడ్డారు. నిజ జీవితంలో ఈ ఇద్దరు జతకూడితే బాగుండు అని ఆశపడ్డారు అభిమానులు. వాళ్లు ఆశించినట్టుగానే మిత భాషి అయిన ఆదిత్యకు గలగలా మాట్లాడుతూ చలాకీగా ఉండే శ్రద్ధా అంటే ఇష్టం ఏర్పడింది. అలా ఆమె తన ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే చాలు.. అంతకన్నా జీవితానికింకేం కావాలి అనుకున్నాడు. ఆ మాటే ఆమెతో చెప్పాడు. స్వచ్ఛమైన నవ్వుతో ‘ఓకే’ అంది. ఆ ప్యార్ కంటిన్యూ అయింది. లేట్ నైట్ పార్టీలు.. ఏ కొంచెం టైమ్ దొరికినా ఏకాంతవాసాలు.. హాలీడేయింగ్లతో కాలాన్ని క్వాలిటీగా మలచుకున్నారు. పెళ్లితో శుభం కార్డ్ వేసుకుంటారనే భావించారు బాలీవుడ్ జనాలు. అయితే.. ‘ఆశికీ 2’ సినిమా స్క్రిప్ట్లాగే సాగింది వాళ్ల ప్రేమ కథ. శ్రద్ధా కపూర్ నటించిన సినిమాలు సక్సెస్ అవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్లిపోయింది. ఆదిత్య రాయ్ కపూర్‌కు మాత్రం ఇంకా స్ట్రగుల్ తప్పలేదు. అతని మనసులో ఎక్కడో ఓడిపోతున్న భావన. తగ్గట్టుగానే శ్రద్ధా తల్లిదండ్రులు ఆమె మీద ఆంక్షలు పెట్టారట.. ఆదిత్యతో చెలిమికి హద్దులు పెట్టుకోమని. శ్రద్ధా లెక్క చేయకపోయినా.. ఆదిత్య గ్రహించాడు. ఏ చలాకితనాన్నయితే జీవితాంతం తోడుగా కావాలనుకున్నాడో ఆ చలాకితనం నుంచి దూరం కోరుకోసాగాడు. ఆమె సక్సెస్ అతనిలో ఆత్మన్యూనత పెంచసాగింది. అది అసూయగా మారకముందే ఆ బంధంలోంచి బయటపడాలనుకున్నాడు. ఆదిత్యను అర్థం చేసుకున్న శ్రద్ధా అతనికి స్పేస్ ఇచ్చింది. పక్కకు తప్పుకున్నాడు. అతని నిర్ణయాన్ని గౌరవించింది ఆమె. అలా ఇద్దరూ విడిపోయారు. కాని మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. అయితే..ఈ జంట తమ ప్రేమ కథను ఎప్పుడూ ఒప్పుకోలేదు. చాలా పత్రికలు.. చానెళ్లు వాళ్ల మధ్య ఉన్న చనువు గురించి ప్రశ్నల వర్షం కురిపించినా బయటపడలేదు. ‘నేను సింగిలే. నా రిలేషన్షిప్ స్టేటస్ మారలేదు. నా దృష్టిలో ప్రేమ ఒక బాధ్యత. ఆ బాధ్యతను మోసేందుకు సిద్ధమయ్యాకే నచ్చిన మనిషితో కమిట్ అవుతా. ప్రస్తుతానికి నేను, శ్రద్ధా గుడ్ ఫ్రెండ్స్‌మి అంతే’ అని ఆదిత్య రాయ్ కపూర్, ‘ఆశికీ 2 సినిమా షూటింగప్పుడు, తర్వాత.. మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. మాకు అంటే నాకు, ఆదిత్యకే కాదు మోహిత్ సూరి (దర్శకుడు)కి కూడా. అలా ఆ సినిమా మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చింది. స్నేహం తప్ప మా మధ్య ఇంకేం లేదు. ఆ స్నేహాన్ని జీవితాంతం కాపాడుకుంటాం’ అని శ్రద్ధా కపూర్ చెప్పారు. - ఎస్సార్ -
‘మలంగ్’కు రానుంది గడ్డు కాలమే
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మలంగ్: అన్లిష్ ద మ్యాడ్నెస్’. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల మందుకు వచ్చింది. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య సరైన హిట్ దొరకని ఆదిత్య కపూర్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ఆదిత్య విజృంభిస్తే, ప్రేమ సన్నివేశాల్లో దిశా అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఎక్కువ భాగం గోవాలోనే షూటింగ్ జరుపుకుంది. (మలంగ్ ట్రైలర్‌ను వీక్షించండి) ‘మలంగ్’ తొలివారం మంచి వసూళ్లనే రాబట్టింది. విడుదలైన తొలి నాడు సుమారు రూ.7 కోట్లు రాబట్టగా తర్వాతి రోజుల్లో వరుసగా రూ. 8, 10 కోట్లు కురిపించింది. దీంతో వీకెండ్లో పుంజుకున్నట్లు కనిపించినా.. సోమవారానికి మాత్రం వసూళ్లు రూ.4 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. తొలుత కలెక్షన్లలో దూకుడు ప్రదర్శించిన ఈ చిత్రం దాన్ని కొనసాగించడంలో మాత్రం కాస్త తడబడుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ.36 కోట్లు రాబట్టింది. కాగా వాలంటైన్స్ డే నాడు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా సినిమా ‘లవ్ ఆజ్ కల్2’ విడుదల అవుతుండటంతో ‘మలంగ్’ వసూళ్లకు గండిపడే అవకాశాలున్నాయి. (ఔను: వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు) చదవండి: బైక్‌పై షికారు చేస్తున్న సారా, కార్తీక్! -
మలంగ్ ట్రైలర్ లాంచ్
-
మలంగ్ ట్రైలర్ వచ్చేసింది
ముంబై: ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన తాజా బాలీవుడ్ సినిమా మలంగ్. అనిల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ.. హంతకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. చంపడాన్ని అలవాటుగా చేసుకున్న కిల్లర్‌గా ఆదిత్య.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. ప్రేమికులుగా నటించిన ఆదిత్య, దిశ మధ్య మోతాదుకు మించి లవ్, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. బికినీ సీన్‌తో ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చిన దిశ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ట్రైలర్ క్లైమాక్స్‌లో తమంతా చంపడాన్ని ఎంజాయ్ చేస్తామన్న రీతిలో సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలు డైలాగ్ చెప్పడం కొసమెరుపు. ఆదిత్య భూజాల మీద కూర్చుని.. అతడితో దిశ లిప్ లాక్ చేస్తున్న ఈ సినిమా స్టిల్‌ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ లవ్, ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. -
అప్పుడు కాలు.. ఇప్పుడు చేయి!
వరుస గాయాలతో హీరోయిన్ దిశా పాట్నీ ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సల్మాన్‌ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్ సమయంలో దిశా కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా మరోసారి దిశా గాయపడ్డారు. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మలాంగ్’ సినిమాలో దిశాపాట్నీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూట్లోనే ఆమె చేతికి గాయమైంది. సీన్ కంప్లీట్ చేశాకే దిశా హస్పిటల్‌కి వెళ్లారు. పెద్ద గాయం కాకపోవడంతో నో రెస్ట్ అంటున్నారు దిశా. ఆదిత్యారాయ్ కపూర్, కునాల్ కేము, అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ముంబైలోనే మకాం
తిరిగి తిరిగి ముంబైలోనే మకాం పెట్టడానికి రెడీ అవుతున్నారు ‘సడక్’ టీమ్. 1991లో మహేశ్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సడక్ 2’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ చిత్రం కోసం మళ్లీ డైరెక్టర్ చైర్లో కూర్చోనున్నారు మహేశ్‌భట్. చివరిసారిగా 1999లో ‘కారతూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు మహేశ్‌భట్. తాజాగా ఆయన తీయనున్న ‘సడక్ 2’లో సంజయ్‌దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్యతారలుగా నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ని ముందుగా రొమేనియాలో ప్లాన్ చేశారు. అక్కడి లొకేషన్లను కూడా పరిశీలించారు. అక్కడి లొకేషన్స్ నచ్చినప్పటికీ లోకల్ కాస్ట్ అండ్ క్రూ, కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలోనే జరపాలనుకుంటున్నారు. ఆల్రెడీ ముంబైలోని ఓ స్టూడియోలో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. తొలుత సంజయ్‌దత్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు టీమ్. మే 15 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. -
నటి కోసం గొడవ పడలేదు..ఇదిగో ప్రూఫ్: హీరో
నటి శ్రద్ధా కపూర్ కోసం బాలీవుడ్ హీరోలు ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్యరాయ్ కపూర్ గొడవపడ్డారంటూ గతవారం బాలీవుడ్లో రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్‌కు తెరదించుతూ తనదైన స్టైల్లో ఫర్హాన్ అఖ్తర్ తాజాగా వివరణ ఇచ్చాడు. ’వాళ్లు ఏదేదో అంటున్నారు కానీ ఇదిగో మేం ఇలా ఉన్నాం.. రిప్ రూమర్స్’ అంటూ ఆదిత్యరాయ్తో దిగిన ఫొటోను ఫర్హాన్ ట్వీట్ చేశాడు. గత రాత్రి తాము ఆనందంగా గడిపామంటూ చెప్పాడు. మహేశ్ భట్ కుటుంబం పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలో శ్రద్ధా కోసం ఫర్హాన్, ఆదిత్య గొడవ పడ్డారని గతవారం బాలీవుడ్ మీడియా కోడై కూసింది. భట్ కుటుంబ వేడుకలకు 'ఆషికీ-2' స్టార్స్ ఆదిత్య, శ్రద్ధ జంటగా కలిసి హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, కొంతకాలం వీరు డేటింగ్ చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇలా ఎక్స్ లవర్స్ కలిసి వచ్చి పార్టీలో హల్చల్ చేయడం ఫర్హాన్ అఖ్తర్‌కు నచ్చలేదట. 'రాక్ ఆన్ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు ఇప్పటివరకు ఈ కథనాలను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ చేయలేదు. ఈ నేపథ్యంలో శ్రద్ధ, ఆదిత్యతో కలిసి ఈ పార్టీకి రావడం, సన్నిహితంగా మెలుగడం ఫర్హాన్ కు కోపం తెప్పించిందని, అందుకే ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని అప్పట్లో కథనాలు వచ్చాయి. శ్రద్ధ విషయంలో ఇద్దరు హీరోల గొడవ జరిగి.. వైరం కొనసాగుతున్నదని వస్తున్న కథనాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు ఫర్హాన్ తనదైన స్టైల్లో ఈ ట్వీట్‌తో రిప్లై ఇచ్చాడు. And that, as they say, is that.. RIP rumours. #lastnight #chilltimes pic.twitter.com/TlTGYtWYwY — Farhan Akhtar (@FarOutAkhtar) 9 April 2017 -
నటి కోసం కొట్టుకున్న హీరోలు!
ముంబై: బాలీవుడ్లో వివాదాలకు, వదంతులకు కొదువుండదు. కానీ, తాజాగా వెలుగుచూసిన ఓ రూమర్ మాత్రం బాలీవుడ్ సర్కిల్స్‌లో కలకలం రేపుతోంది. అదే బాలీవుడ్ నటులు ఆదిత్య రాయ్ కపూర్, ఫర్హాన్ అఖ్తర్ గొడవకు దిగడం.. అదికూడా నటి శ్రద్ధా కపూర్ కోసమేనట. ఇటీవల మహేశ్ భట్ కుటుంబం పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో అందరూ స్టార్స్ లాగే 'ఆషికీ-2' స్టార్స్ ఆదిత్య, శ్రద్ధ జంటగా హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, కొంతకాలం వీరు డేటింగ్ చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇలా ఎక్స్ లవర్స్ కలిసి వచ్చి పార్టీలో హల్చల్ చేయడం ఫర్హాన్ అఖ్తర్‌కు నచ్చలేదట. 'రాక్ ఆన్ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు ఇప్పటివరకు ఈ కథనాలను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ చేయలేదు. ఈ నేపథ్యంలో శ్రద్ధ, ఆదిత్యతో కలిసి ఈ పార్టీకి రావడం, సన్నిహితంగా మెలుగడం ఫర్హాన్ కు కోపం తెప్పించిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఆ గొడవ ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి ఫర్హాన్ ఇంటి వద్ద శ్రద్ధ కనిపించింది. గొడవ నేపథ్యంలో ఫర్హాన్‌కు నచ్చజెప్పేందుకు, ఇద్దరి నటుల మధ్య రాజీ కుదిర్చేందుకే మంగళవారం రాత్రి ఫర్హాన్ ఇంటికి శ్రద్ధ వచ్చిందని ఆ వర్గాలు చెప్పాయి. -
ఆ పాటకు 15 కోట్ల వ్యూస్..!
ఆషికీ 2 జంట మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఓకె జాను సినిమా కోసం రెండో సారి జతకట్టిన ఈ జోడి, సక్సెస్ పరంగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ సినిమా లోని ఓ పాట అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ మూడు నెలలకు ముందు ఓ రిమిక్స్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన హమ్మ హమ్మ పాటను ఓకె జాను సినిమా కోసం రిమిక్స్ చేశారు. ఈ రొమాటింక్ సాంగ్ వీడియోను డిసెంబర్ 15న యూట్యూబ్‌లో విడుదల చేశారు. శ్రద్దా అందాలకు రెహమాన్ మ్యూజిక్ తొడవ్వటంతో ఈ పాట రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ పాట యూట్యూబ్ వ్యూస్‌లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పాటను 15 కోట్ల 33 లక్షల మందికిపైగా చూశారు. ఈ విషయాన్ని సోని మ్యూజిక్ ఇండియా సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో వెల్లడించింది. 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో హమ్మ హమ్మ మూడో స్థానంలో నిలవగా బేఫికర్ లోని నషే సి చద్కు 20 కోట్ల , బార్ బార్ దేఖో సినిమాలోని కాలా చెష్మా 20 కోట్ల 2 లక్షల వ్యూస్‌తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. #TheHummaSong crosses 150M views! @DharmaMovies @karanjohar @arrahman @Its_Badshah @JubinNautiyal @tanishkbagchi https://t.co/DwJVjJxGKS pic.twitter.com/vaJZPSCnI1 — Sony Music India (@sonymusicindia) 14 March 2017 -
'బంగారమే' 'జాను'గా వస్తోంది.. ట్రైలర్ చూస్తారా?
సరిగ్గా మూడేళ్ల కిందట 'ఆషికీ-2'తో ప్రేక్షకులను ప్రేమలోకంలో ముంచెత్తిన జోడీ ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్. గతంలో ప్రగాఢమైన ప్రేమకథతో అలరించిన ఈ జోడీ ఇప్పుడు 'ఓకే జాను' అంటూ హిందీ ప్రేక్షకులను పలుకరించబోతున్నది. సహజీవనం, ఆధునిక యువత మనోభావాలకు అద్దం పడుతూ ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' (తమిళంలో 'ఓకే కణ్మని') సినిమాకు ఇది రీమేక్. దక్షిణాది భాషల్లో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జోడీ మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆదిత్య-శ్రద్ధ పెయిర్ కూడా ఇదే ప్రేమకథతో అభిమానుల మనస్సు దోచుకునేందుకు సిద్ధమవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం, గుల్జార్ సాహిత్యంతో మణిరత్నం, కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఓకే జాను' ట్రైలర్ తాజాగా ఆన్లైన్ విడుదలైంది. దక్షిణాది 'ఓకే బంగారం' కన్నా కాస్తా ఘాటు ఎక్కువైనట్టు కనిపిస్తున్న 'ఓకే జాను' ట్రైలర్ నెటిజన్లను ఉర్రుతలూగిస్తోంది. మీరు ఓ లుక్ వేయండి. -
కత్రినా.. సీక్రెట్ డేటింగ్?
రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత కత్రినా కైఫ్ ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? కత్రినా కైఫ్ ‘నో’ అంటుంటే ముంబై మీడియా ‘యస్’ అంటోంది. మొన్నటివరకూ ‘బార్ బార్ దేఖో’లో కో-స్టార్ సిద్ధార్ధ్ మల్హోత్రాతో ఆమె ప్రేమలో పడ్డారనే వార్త వినిపించింది. ఇప్పుడు ‘ఫితూర్’లో కలసి నటించిన ఆదిత్యారాయ్ కపూర్ పేరు వినిపిస్తోంది. ‘‘ఆదిత్యారాయ్ కపూర్, కత్రినా కైఫ్‌లు సీక్రెట్‌గా డేటింగ్ చేసుకుంటున్నారట’’... ముంబైలో జోరుగా షికారు చేస్తున్న న్యూస్ ఇది. షారుఖ్ ఖాన్, సిద్ధార్ధ్ మల్హోత్రా, పరిణీతీ చోప్రా, అలియా భట్ తదితరులతో కలసి ఈ ఇద్దరూ డ్రీమ్ టీమ్ యు.ఎస్.ఎ. టూర్‌కి వెళ్లారు. ఆ టూర్లో ఈ ఇద్దరి సీక్రెట్ డేటింగ్ ఎవరి కంటో పడటం, వాళ్లు బయటపెట్టడం జరిగింది. -
తెలుగులో బంగారం..హిందీలో జాను!
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తెలుగులోనే కాదు తమిళంలో (‘ఓకే కన్మణి’) కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ‘ఓకే జాను’ పేరుతో బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యా రాయ్, శ్రద్ధా కపూర్ జంటగా షాద్ అలీ దర్శకత్వంలో ప్రముఖ దర్శక- నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఓకే జాను’ని విడుదల చేస్తున్నట్లు కరణ్ ప్రకటించారు. అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. -
ఒక పెద్ద హీరో.. నలుగురు కుర్ర హీరోలతో..
ముంబయి: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు హీరోలతో ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఆడిపాడనుంది. తన తదుపరి ఒకే చిత్రంలో ఐదుగురు నటులతో కలిసి నటించనుంది. వీరిలో ఒకరు అగ్రహీరో, సూపర్ స్టార్ షారుక్ ఖాన్కాగా మిగితా నలుగురు యంగ్ హీరోలు. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ కొట్టిన గౌరీ షిండే ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్గా నటించనుండగా ఆష్కి-2 ఫేమ్ ఆదిత్యరాయ్ కపూర్, అలి జాఫర్, అంగాడ్ బేడి, కునాల్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ కూడా నటించనున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటనే విషయం మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. -
బాలీవుడ్‌కీ బంగారం!
గాసిప్ ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్లు మరోసారి జోడీ కట్టబోతున్నారా? అవుననే అంటున్నాయి గుసగుసలు. మణిరత్నం రొమాంటిక్ డ్రామా ‘ఓకే కణ్మని’ (తెలుగులో ఓకే బంగారం)ను బాలీవుడ్లో రిమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన షాద్ ఆలి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నారట. ఈయన గతంలో మణిరత్నం ‘అలైపాయుతె’ (తెలుగులో సఖీ) సినిమాను ‘సాథియా’ పేరుతో హిందీలో రిమేక్ చేశాడు. ‘ఓకే బంగారం’ రీమేక్ కోసం ఒరిజినల్లో నటించిన హీరోహీరోయిన్లు సల్మాన్ దుల్కర్, నిత్యా మీనన్‌లతో పాటు చాలామందినే అనుకున్నారు. ఏమైందో ఏమోగానీ... వారి పేరు మళ్లీ వినిపించలేదు. ఆలియాభట్, వరుణ్ ధావన్‌లను సంప్రదించారుగానీ... వారి బిజీ షెడ్యూల్స్ వల్ల ‘నో’ చెప్పేశారట. ఆ తరువాత ఆదిత్య, సోనాక్షి సిన్హాల జోడీని అనుకున్నా అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు తాజాగా ‘ఆషికీ-2’ జంట శ్రద్ధా కపూర్, ఆదిత్యరాయ్ కపూర్ల పేరు జోరుగా వినిపిస్తుంది. అయితే ఆదిత్య, శ్రద్ధాల మధ్య విభేదాలు తలెత్తాయని... వారు మళ్లీ కలిసి నటించే ఛాన్సు లేదని కొందరు గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే దీన్ని ఖండించేవారు కూడా లేకపోలేదు. ‘వారిద్దరు ప్రొఫెషనల్స్. వారి ప్రొఫెషనలిజం ముందు... విభేదాలు చాలా చిన్న విషయం. తప్పనిసరిగా కలిసి నటిస్తారు’ అనేవాళ్లు కూడా ఉన్నారు. ‘సాథియా’ విజయం సాధించడంలో రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ కీలకపాత్ర పోషించింది. మరి ‘ఓకే బంగారం’ రీ మేక్‌లోనూ రెహమాన్ మ్యూజిక్‌ను వాడుకుంటే... ఇక అంతా బంగారమే! -
పన్నెండు గంటల రొమాన్స్‌కి నాలుగు గంటల ప్రాక్టీస్!
రొమాన్స్ చేయడానికిప్రాక్టీస్ చేయాలా? మనసులో ప్రేమ ఉంటే రొమాన్స్ దానంతట అది పుట్టుకొచ్చేయదూ. మరి.. సినిమాల్లో రొమాన్స్ చేసే నాయకా నాయికలందరూ ప్రేమికులు కాదు కదా! అంత అద్భుతంగా రొమాంటిక్ సీన్స్ ఎలా చేస్తారనుకుంటున్నారా? ఆ మూడ్‌లోకి వెళ్లడానికి వాళ్లు మానసికంగా చాలా ప్రిపేర్ అవుతారు. అలా ప్రిపేర్ అయ్యి, కత్రినా కైఫ్ ఇప్పటివరకూ బోల్డన్ని రొమాంటిక్ సీన్స్‌లో నటించారు. కానీ, ఈసారి మాత్రం ఎంత ప్రిపేర్ అయినా రొమాన్స్ చేయలేకపోయారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరితో రొమాన్స్ చేయాలనుకున్నారు? ఆ సీన్లో ఎందుకు లీనం కాలేకపోయారు? వాస్తవానికి ఆమె మాత్రమే కాదు.. ఆ చిత్రకథానాయకుడు కూడా ఆమెతోరొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. యువనటుడు ఆదిత్య రాయ్ కపూర్ సరసన కత్రినా కైఫ్ ‘ఫిటూర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ మూవీ. ఆదిత్య, కత్రినా మధ్య బోల్డన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. ఇటీవల కాశ్మీర్లో ఆదిత్య, కత్రినా పాల్గొనగా ఓ పెదవి ముద్దు సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్ చేయడానికి ఆదిత్య, కత్రినా తెగ ఇబ్బందిపడ్డారట. కాశ్మీర్ తర్వాత ముంబయ్‌లో ఈ ఇద్దరి మీద ఓ రొమాంటిక్ సీన్ తీయడానికి చిత్రదర్శకుడు అభిషేక్ కపూర్ ప్లాన్ చేశారు. ఈ శృంగార సన్నివేశం చాలా ఘాటుగా ఉంటుందట. అందుకని, ఓ నాలుగు గంటల పాటు కత్రినా, ఆదిత్య ప్రాక్టీస్ చేశారు. కానీ, అంతా వృథాయే. టేక్‌ల మీద టేక్‌లు తీసుకున్నారు. అలా పన్నెండు గంటలు గడిచిపోయింది. ఈ పన్నెండు గంటల్లో లెక్కలేనన్ని సార్లు వాళ్లు రొమాన్స్ చేసినా, అది పేలవంగా అనిపించిందట. పన్నెండు గంటల తర్వాత చేసిన రొమాన్స్ ఫర్వాలేదనిపించి చివరికి దర్శకుడు ఓకే చేశారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఎందుకింత ఇబ్బందిపడ్డారు? ఆదిత్య అప్ కమింగ్ హీరో కాబట్టి, కత్రినాలాంటి స్టార్‌తో రొమాన్స్‌కి కంగారు పడి ఉంటారు. మరి.. కత్రినా సంగతేంటి? రణబీర్ కపూర్‌తో త్వరలో వివాహం అనే వార్త వస్తోంది కదా.. ఈ సమయంలో ఇలాంటి రొమాంటిక్ సీన్ ఏంటి? అని ఇబ్బందిపడి ఉంటారా? ఏమో... కత్రినాకే తెలియాలి. -
మా మధ్య ఏమీలేదు!
‘ఆషికి-2’లో శ్రద్ధా కపూర్‌ను చూసి ‘‘అబ్బ..ఇలాంటి అమ్మాయి నాకు లవర్ అయితే ఎంత బాగుంటుంది’’ అని కొంతమంది యువకులు అనుకునే ఉంటారు. ఈ హాట్ బ్యూటీ అంతగా కుర్రకారుని ఆకట్టుకున్నారు. శ్రద్ధా ఎంతమంది గుండెల్లో గూడుకట్టుకున్నారో చెప్పలేం కానీ.. హీరో ఆదిత్య రాయ్ కపూర్ మనసులో మాత్రం ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రద్ధా ఈ విషయం గురించి మాట్లాడుతూ -‘‘అందరూ అనుకుంటున్నట్లు ఆదిత్యకూ నాకూ మధ్య ఏమీ లేదు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అంతకు మించి ఏదైనా ఉందని ఎవరైనా అనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే లేని విషయాన్ని ఉందన్నట్లుగా ఊహించడం ఎందుకు?’’ అన్నారు. ఆదిత్యతో తనకు స్నేహం కుదరడానికి గల కారణం గురించి చెబుతూ - ‘‘ ‘ఆషికి-2’ చేస్తున్నప్పుడు ఇద్దరం సన్నివేశాలను చర్చించుకుని చేసేవాళ్లం. అలా మా మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ సినిమా తాలూకు అనుభవాలు మా ఇద్దరి మనసుల్లోంచి ఎప్పటికీ చెరిగిపోవు. ఇప్పుడే కాదు.. ఆదిత్య నాకెప్పటికీ ఓ స్పెషల్ ఫ్రెండ్‌గా నిలిచిపోతాడు’’ అని శ్రద్ధాకపూర్ చెప్పారు. -
ఘాటైన ముద్దు...
అది శ్రీనగర్‌లోని దాల్ సరస్సు. మంచు కురుస్తున్న వేళ. ఆ సరస్సు ఒడ్డున తెల్లటి బురఖా ధరించిన ఓ యువతి తన ప్రియుడి పెదవిని గాఢంగా చుంబిస్తోంది. అంతటి చలిలో కూడా ప్రేమికుల తనువులు వేడెక్కాయి. కాలానికి కూడా హద్దులు చెరిపేశారు. కొంచెం సేపు అయ్యాక కట్....కట్...కట్... అని అరుపు. ఈ సన్నివేశం ‘ఫితూర్’ చిత్రం కోసం ఆదిత్యరాయ్‌కపూర్, కత్రినాకైఫ్‌ల మధ్య చిత్రీకరించారు. ‘కె పోచే’ ఫేమ్ అభిషేక్కపూర్ దర్శకుడు. చార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కశ్మీర్లో భారీగా వరదలు వచ్చాక అక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇదే. ఇందులో సీనియర్ నటి రేఖ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
ఆహార యాత్రకు ఛలో ఛలో
విహార యాత్రలు తెలుసు కానీ, ఆహార యాత్ర గురించి విని ఉండరు. ఈ విచిత్రమైన యాత్రతో ఆదిత్యరాయ్ కపూర్, పరిణీతి చోప్రా బిజీ కానున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘దావత్-ఇ-ఇష్క్’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ‘ఫుడ్’కి ప్రాధాన్యం ఉంది. అందుకని, ప్రచార కార్యక్రమాలను ఆహారం నేపథ్యంలో ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు హబీబ్ ఫైసల్. దర్శకునిగా ఆయనకిది తొలి చిత్రం. సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేయడానికి గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున ప్రచార కార్యమ్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘ముంబయ్ టు చంఢీగడ్’ ఆహార యాత్ర ప్లాన్ చేశారు. ముంబయ్ నుంచి చంఢీగడ్ వరకు కారులో ప్రయాణిస్తారు ఆదిత్య, పరిణీతి. ఆ మార్గ మధ్యంలో కాకా హోటల్స్ మొదలుకుని స్టార్ హోటల్స్ వరకూ వెళ్లి, అక్కడ ప్రాచుర్యంలో ఉన్న వంటకాల్ని రుచి చూస్తుంది ఈ జంట. పనిలో పనిగా అక్కడివాళ్లకి ‘దావత్-ఇ-ఇష్క్’ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. -
పరిణీతికి దావత్
పరిణీతిచోప్రా, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా నటిస్తున్న కామెడీ సినిమా ‘దావత్ ఏ ఇష్క్’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ‘యూట్యూబ్’లో సందడి చేస్తోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా, ఆ సంస్థ గత సినిమాల మాదిరిగానే ఫీల్‌గుడ్ సినిమా. ఈ చిత్రంలో ఆదిత్యరాయ్ కపూర్ లక్నోకు చెందిన వంటవాడిగా, పరిణీతి అతడిని ప్రేమలో పడేసే హైదరాబాదీ అమ్మాయిగా చేస్తున్నారు.