![Ananya Panday Hides Face she Goes for Drive with Aditya Roy Kapur in Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/23/ananya1.jpg.webp?itok=zaUGaHEw)
లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా నామమాత్రపు విజయాన్ని కూడా అందుకోలేదు. అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ బ్యూటీ.. గంపెడాశలు పెట్టుకున్న లైగర్ కూడా ఫ్లాపవడంతో కొంత నిరాశచెందింది. అయినా సరే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ప్రస్తుతం అనన్య హిందీలో నాలుగు చిత్రాలు చేస్తోంది.
ఇకపోతే డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో ఉండే అనన్య ఇటీవల బాయ్‌ఫ్రెండ్, నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఈ లవ్ బర్డ్స్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం రాత్రి షికారుకు వెళ్లారు. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుంది.
వీరిని ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలతో క్లిక్‌మనిపించగా అనన్య తన ముఖాన్ని దాచేందుకు ప్రయత్నించింది. అయితే ఆదిత్య మాత్రం హాయిగా చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. 'వీరి జంట చూడచక్కగా ఉంది..', 'ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నట్లుగా ఉన్నారు', 'వీరి ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది, ఇంతదాకా వచ్చాక ఇంకా సిగ్గుపడటం దేనికి?' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: కిడ్నీ ఫెయిల్.. బతకడం కష్టమనుకున్నా.. ఇంట్లో వాళ్లే పట్టించుకోలేదు: హీరోయిన్
ఒకానొక సమయంలో చనిపోదామనుకున్నా: జబర్దస్త్ వర్ష
Comments
Please login to add a commentAdd a comment