
విజయ్ దేవరకొండ 'లైగర్'తో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు బాధలో ఉండిపోయింది. తన పెంపుడు శునకం చనిపోవడంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)
2008 నుంచి ఫడ్జ్ అనే పెంపుడు కుక్క అనన్య పాండే ఇంట్లో ఉంది. ఇప్పుడు అది చనిపోయింది. ఈ మేరకు తన పెట్ డాగ్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కొన్ని జ్ఞాపకాల్ని పంచుకుంది. ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతా అని కాస్త ఎమోషనల్ అయింది.
అనన్య తండ్రి చుంకీ పాండే కూడా నటుడే. బాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉన్నాడు. ప్రభాస్ 'సాహో' మూవీలో కూడా విలన్ క్యారెక్టర్ చేశాడు. అనన్య పాండే కూడా పలు సినిమాలు చేసింది కానీ నటిగా ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. ఈమె నటించిన 'కాల్ మీ బే' మూవీ సెప్టెంబరు 6న నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)
Comments
Please login to add a commentAdd a comment