ఐటం సాంగ్‌ చేస్తా.. కాకపోతే కొన్ని కండీషన్స్‌! | Ananya Panday Conditions for Doing Item Number | Sakshi
Sakshi News home page

Ananya Panday:ఐటం సాంగ్‌ చేస్తానంటున్న లైగర్‌ హీరోయిన్‌.. కాకపోతే కొన్ని కండీషన్స్‌!

Published Mon, Sep 30 2024 4:26 PM | Last Updated on Mon, Sep 30 2024 4:57 PM

Ananya Panday Conditions for Doing Item Number

ఒకప్పుడు ఐటం సాంగ్స్‌ అంటే హీరోయిన్లు జంకేవారు. కానీ ఇప్పుడు చాలామంది తారలు స్పెషల్‌ సాంగ్‌లో కనిపించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రత్యేక పాటలో కనిపించేందుకు తనకూ ఎలాంటి అభ్యంతరం లేదంటోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే.. కానీ తనకంటూ కొన్ని కండీషన్స్‌ ఉన్నాయట!

మితిమీరొద్దు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఐటం సాంగ్‌ చేయడానికి నేను ఒప్పుకుంటాను. కాకపోతే.. ఆ సాంగ్‌లో మరీ అతిగా అందాల ప్రదర్శన ఉండకూడదు. పైగా ఆ సాంగ్‌లో నా పాత్రకు గౌరవం ఇవ్వాలి. కాదు, కూడదు అంటే మాత్రం ఐటం సాంగ్‌ చేసేందుకు అంగీకరించను. అలాగే పాటలో అమ్మాయిని చూపించే విధానంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. 

అలాగైతే ఓకే
ఏళ్ల తరబడి చిత్రీకరిస్తున్న పద్ధతినే ఇప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. పాటలో అమ్మాయిని అందంగా చూపించాలి, కానీ ఒక బొమ్మగా చిత్రీకరించొద్దు. ఎక్కడ ఎలా ఉండాలి? ఎలా నడుచుకోకూడదు? అనే అధికారం పూర్తిగా అమ్మాయికే ఇవ్వాలి' అని చెప్పుకొచ్చింది. మరి ఈ లైగర్‌ బ్యూటీ కోరుకున్నట్లుగా ఎవరైనా ఈ రకంగా ఐటం సాంగ్‌ రాసుకుని ఈమెను సంప్రదిస్తారేమో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement