
దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ కమర్షియల్ సినిమాలో జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై హీరోయిన్ అనన్య పాండే స్పందించింది. తన లేటెస్ట్ మూవీ కంట్రోల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దేవర మూవీ గురించి మాట్లాడింది.

అంత ఈజీ కాదు
కమర్షియల్ సినిమాల్లో నటించడం చాలా ఈజీ అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ అది నిజం కాదు. అలాంటి చిత్రాల్లో నటించడమనేది ఒక కళ. దేవరలో జాన్వీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా పాటల్లో తన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఆమె ఎనర్జీ గురించి మాటల్లో చెప్పలేం అని మెచ్చుకుంది.

ఆ కోణంలో ఆలోచిస్తా..
ఇంకా మాట్లాడుతూ.. నటిగా కొత్త తరహా పాత్రలు చేయాలనుంది. స్క్రిప్ట్ చదివేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో నుంచే ఆలోచిస్తాను. దీన్ని జనాలు ఆదరిస్తారు అనిపించిన కథల్ని వెంటనే ఓకే చేసేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అనన్య నటించిన కంట్రోల్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
చదవండి: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్!
Comments
Please login to add a commentAdd a comment