
శ్రీదేవి కుమార్తెగా అందరికీ తెలిసిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్‌గా 'దేవర' నుంచి ఈమె సాంగ్ ఒకటి విడుదలై తెగ వైరల్ అయిపోయింది. దీంతో అప్పుడప్పుడు ఫ్యాన్స్ జాన్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
(ఇదీ చదవండి: కనీసం మర్యాద కూడా ఇవ్వరు.. ఫోన్ చేస్తే ఇలా మాట్లాడుతారు: సంగీత)
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రక్షా బంధన్ (రాఖీ) పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే జాన్వీ కపూర్ తాజాగా షూటింగ్ కోసం ఓ స్టూడియోకి వెళ్తుండగా.. ఓ అభిమాని వచ్చి రాఖీ కట్టమని రిక్వెస్ట్ చేశాడు. దీంతో జాన్వీ అతడు అడిగింది చేసింది.
ఇదంతా బాగానే ఉంది కానీ రాఖీ కట్టిన తర్వాత సదరు అభిమాని.. జాన్వీ కపూర్‌కే డబ్బులివ్వబోయాడు. ఆమె నవ్వుతూ లోపలికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే అక్కడున్న వాళ్లందరూ నవ్వుకున్నారు. రాఖీ కట్టడం సంగతి అటుంచితే ఈ డబ్బులివ్వబోయిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోతోంది.
(ఇదీ చదవండి: కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్)
Janhvi Kapoor Gracefully Declines Shagun from a Paparazzo, Keeping it Sweet and Humble!#buzzzooka_events #janhvikapoor #bollywood #celebrity #trendingreels #reelsinstagram pic.twitter.com/SFhNIfDlPT
— Buzzzooka Events (@BuzzzookaEvents) August 20, 2024