బాలీవుడ్ చేయలేనిది.. 'దేవర' చేసి చూపించాడు! | Janhvi Kapoor Devara Song News | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీని సరిగ్గా ఉపయోగించుకున్న 'దేవర'

Published Wed, Aug 7 2024 7:44 AM | Last Updated on Wed, Aug 7 2024 10:37 AM

Janhvi Kapoor Devara Song News

కొన్నిసార్లు అంతే! అందుబాటులో ఉన్నాసరే సరిగా వినియోగించుకోవడం తెలియాలి. ఎవరో వచ్చి తాము చేయలేనిది చేస్తే అప్పుడు అర్థమవుతోంది. హిందీ దర్శకనిర్మాతల పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉందేమో! ఎందుకంటే బాలీవుడ్ చేయలేని ఓ పని.. ఇప్పుడు 'దేవర' చేసి చూపించాడు. ఇప్పటివరకు ఎవరి గురించి చెప్పామా ఈపాటికే మీకు అర్థమై ఉంటుందనుకుంటా! హీరోయిన్ జాన్వీ కపూర్ గురించే ఇదంతా!

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హోస్టింగ్ నుంచి తప్పుకొన్న కమల్.. కారణమదే)

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ అందరికీ తెలుసు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఆరేళ్లు అయిపోయింది గానీ ఇప్పటివరకు సరైన హిట్ ఒక్కటీ లేదు. పోనీ గ్లామర్ పరంగా అయినా బాలీవుడ్ ఉపయోగించుకుందా అంటే అదీ లేదు. జాన్వీ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పెద్దగా గ్లామర్ చూపించే ఛాన్స్ రాలేదు. ఇప్పుడదే 'దేవర' చేసి చూపించాడు.

జాన్వీ కపూర్ అందాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఒక్కరు కూడా 'దేవర' పాటలో ఉన్నంత అందంగా ఈమెని చూపించలేకపోయారు. ఈ సాంగ్ మీద ట్రోల్స్ వస్తున్నాయి గానీ జాన్వీని మాత్రం ఎవరేం అనట్లేదు. యూట్యూబ్‌లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే.. థియేటర్లలో ఈ పాట చూసిన తర్వాత జాన్వీకి ఇంకెంత మంది ఫ్యాన్స్ అయిపోతారో?

(ఇదీ చదవండి: 'దేవర' విలన్‌కి అరుదైన వ్యాధి.. అదేంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement