
సెలబ్రిటీలు చాలామంది అందంగా కనిపిస్తుంటారు. కాకపోతే కొందరికి అరుదైన వ్యాధులు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. కొన్నాళ్ల ముందు తనకు ఏడీహెచ్‌డీ అనే రుగ్మత ఉందని మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ బయటపెట్టాడు. ఇలాంటి వ్యాధి తనకు కూడా ఉందని మరో మలయాళ నటుడు షైన్ టాక్ చాకో చెప్పుకొచ్చాడు. కాకపోతే తానేం బాధపడట్లేదని అన్నాడు.
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))
మలయాళ సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో.. తెలుగులో నాని 'దసరా', నాగశౌర్య 'రంగబలి' సినిమాల్లో విలన్‌గా చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర'లో ప్రతినాయకుడిగా నటించాడు. ఇదలా పక్కనబెడితే ఈ ఏడాది జనవరిలో తనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడేమో ఆమెతే బ్రేకప్ అయిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షైన్.. తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD)తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇది ఉన్న వ్యక్తులు.. ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని, ఇతర నటీనటుల నుంచి ప్రత్యేకంగా ఉండటానికి ట్రై చేస్తారని చెప్పాడు. బయట వ్యక్తులు దీన్ని ఓ రుగ్మతగా భావిస్తారని తాను మాత్రం దీన్ని ఓ క్వాలిటీలానే చూస్తానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?)
Comments
Please login to add a commentAdd a comment