ADHD
-
'దేవర' విలన్‌కి అరుదైన వ్యాధి.. అదేంటంటే?
సెలబ్రిటీలు చాలామంది అందంగా కనిపిస్తుంటారు. కాకపోతే కొందరికి అరుదైన వ్యాధులు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. కొన్నాళ్ల ముందు తనకు ఏడీహెచ్‌డీ అనే రుగ్మత ఉందని మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ బయటపెట్టాడు. ఇలాంటి వ్యాధి తనకు కూడా ఉందని మరో మలయాళ నటుడు షైన్ టాక్ చాకో చెప్పుకొచ్చాడు. కాకపోతే తానేం బాధపడట్లేదని అన్నాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))మలయాళ సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో.. తెలుగులో నాని 'దసరా', నాగశౌర్య 'రంగబలి' సినిమాల్లో విలన్‌గా చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర'లో ప్రతినాయకుడిగా నటించాడు. ఇదలా పక్కనబెడితే ఈ ఏడాది జనవరిలో తనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడేమో ఆమెతే బ్రేకప్ అయిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షైన్.. తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD)తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇది ఉన్న వ్యక్తులు.. ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని, ఇతర నటీనటుల నుంచి ప్రత్యేకంగా ఉండటానికి ట్రై చేస్తారని చెప్పాడు. బయట వ్యక్తులు దీన్ని ఓ రుగ్మతగా భావిస్తారని తాను మాత్రం దీన్ని ఓ క్వాలిటీలానే చూస్తానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?) -
అవగాహనే ప్రధానం
ఏడీహెచ్‌డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను. స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు.. నేను స్కూల్ టీచర్‌గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్బీయింగ్ అవసరం. ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను. వందల మంది టీచర్లకు శిక్షణ స్పెషల్ చిల్డ్రన్కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను. జన్యులోపాలపై అవగాహన ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను. ఒక్కో అడుగు.. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే..
Attention Deficit Hyperactivity Disorder: సుమంత్ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు. కానీ సుమంత్‌ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్‌వర్క్ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది. సుమంత్ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్–డెఫిషిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD).. ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్‌లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది. కారణాలు– పర్యవసానాలు ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు. అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు. స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు. కనీసం ఆరు లక్షణాలు ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. చంచలత్వం (attention deficit) లక్షణాలు: వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం ∙టాస్క్స్ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు హైపర్యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ లక్షణాలు: ►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం ►సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం ►తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం ►ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం ►తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం ►ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం ►ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. తల్లిదండ్రులు ఏం చేయాలి? ►ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్‌గా మీరేం చేయొచ్చంటే.. ►మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి ►పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి ►వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి ►మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి ►ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో అఈఏఈ అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. ►పేరెంటింగ్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి. ►సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ►మందులు మెదడులోని న్యూరోట్రాన్సి్మటర్లు డోపమైన్, నోర్ ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్ ను మెరుగుపరుస్తాయి. -సైకాలజిస్ట్ విశేష్ చదవండి: తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
ఏడీహెచ్‌డీకి, ఆటిజమ్‌కు తేడా తెలుసా!?
కొంతమంది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), ఆటిజమ్లను ఒకే రుగ్మతగా అభిప్రాయపడి, పొరబడుతుంటారు. నిజానికి ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు, ఆటిజమ్ ఉన్న చిన్నారులు... ఈ రెండు కండిషన్స్‌లోనూ పిల్లలు అతి చురుగ్గా ఉంటారు. అయితే ఏడీహెచ్‌డీ చిన్నారుల తల్లిదండ్రులు తరచూ వారి పిల్లాడి గురించి చెబుతూ ‘‘మావాడు అతి చురుకు. చాలా వేగంగా నేర్చుకుంటాడు. కానీ స్కూల్లో చెప్పిందేదీ గుర్తుంచుకోడు’ అంటుంటారు. అయితే ఏడీహెచ్‌డీ అనే సమస్య జ్ఞాపకశక్తికి సంబంధించింది కాదు. ►ఇక ఆటిజమ్ ఉన్న పిల్లల్లోనూ అతిచురుకుదనం ఉన్నప్పటికీ వారి చురుకుదనమంతా నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా, ఏమాత్రం ఫోకస్డ్గా లేకుండా ఉంటుంది. ఆటిజమ్ ఉన్న పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. నేరుగా కళ్లలో కళ్లు కలిపి మాట్లాడలేరు. పైగా వారికి మాట్లాడటంలో సమస్యలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న మనుష్యులూ, వాళ్ల వ్యవహారాలపై ఎలాంటి ఆసక్తీ ఉండదు. ►ఏడీహెచ్‌డీ ఉన్న ప్రతి పిల్లవాడికీ ఆటిజమ్ ఉండదు. అయితే అలా ఉందేమోనని ఒకసారి వైద్యనిపుణుల చేత పరీక్షింపజేసి, ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్యలకు తగిన చికిత్సకు అవకాశం ఉంటుంది కాబట్టి మెరుగుదలకూ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం లేకుండా ఉండాలి. -
బూతులు మాట్లాడుతున్నాడు... ఎలా మాన్పించాలి?
కిడ్స్ మైండ్స్ మా బాబు ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ మధ్య తన మాట తీరులో చాలా తేడా వచ్చింది. ఏదైనా అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. పైగా కొన్ని సందర్భాల్లో బూతులు మాట్లాడటం విన్నాను. రెండు తగి లిస్తే ఇంకెప్పుడూ అలా మాట్లాడనన్నాడు. కానీ స్కూల్లో కూడా అలాగే మాట్లాడుతున్నాడని టీచర్ కంప్లయింట్ చేశారు. ఉన్నట్టుండి ఎందుకిలా అయ్యాడు? తననెలా మార్చాలి? - జె.సుధారాణి, తణుకు సాధారణంగా పిల్లలు టీనేజ్‌లో ఎదురు తిరుగుతారు తప్ప ఆరో తరగతిలోనే అలా చేయడం జరగదు. ఈ వయసులో ఇలాంటి మార్పు, అందు లోనూ సడెన్‌గా రావడం అనేది ఆలో చించాల్సిన విషయం. స్కూల్లోగానీ బయటగానీ ఎవరితోనైనా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటున్నా డేమో చూడండి. ఆ ఫ్రెండ్ అలవాట్లను గమనించండి. తన వల్లే బాబులో ఈ మార్పు అనుకుంటే తనకి కాస్త దూరంగా పెట్టండి. అలాంటి కారణమేమీ కనిపించక పోతే... ఓసారి జాగ్రత్తగా లాలించి అడ గండి... ఎందుకిలా చేస్తున్నావని. అలా చేయడం వల్ల తనకెంత చెడ్డపేరొస్తుందో వివరించండి. మానుకుంటే మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. మానకపోతే పని ష్మెంట్ ఉంటుందని కూడా చెప్పండి. అవసరమైతే ఇవ్వండి కూడా. సాధా రణంగా పరిసరాల్లో మార్పులు, కొత్త స్నేహాల వల్లే పిల్లల్లో ఈ మార్పు కనిపిస్తూ ఉంటుంది. సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలిస్తే పరిష్కారం తెలుస్తుంది. మా అమ్మాయి ఈ మధ్యనే మెచ్యూర్ అయ్యింది. ఓ నెల రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత స్కూల్‌కి పంపించడం మొదలు పెట్టాం. అయితే తను ఇంతకుముందులా ఆటలు ఆడటం లేదని, ఎవరితోనూ సరదాగా గడపడం లేదని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఇంట్లో కూడా హుషారుగా ఉండటం లేదు. డల్‌గా ఉండటం లేదు కానీ తన పని తాను సెలైంట్‌గా చేసుకుని పోతోంది. బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. పైగా ఎవరితోనైనా మాట్లాడమన్నా, ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్లను చూసి ముడుచుకు పోతోంది. మెచ్యూర్ అవ్వడం వల్ల మాన సికంగా ఏదైనా సమస్య వచ్చిందా అని నాకు భయమేస్తోంది. ఇప్పుడేం చేయాలి? - అనిత, ఖమ్మం సమస్య ఏమిటని పాపనే అడిగి చూడాల్సింది. అది ఇప్పుడైనా చేయండి. ఇదేమీ మానసిక వ్యాధి కాదు. మెచ్యూర్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్య రాదు. కాకపోతే దాని గురించి పాప ఆలోచించే విధానం వల్ల వచ్చి ఉండాలి. తను ఇంతవరకూ చిన్నపిల్ల. ఇప్పుడు సడెన్‌గా పెద్దదయ్యిందని అందరూ అని వుంటారు. దాంతో తను ఇంతకు ముందులా ఇంట్లోను, బయట ఉండలేను, ఆడుకోలేను అని ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదంటే తాను పెద్దది అయ్యింది కాబట్టి కాస్త పద్ధతిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అదీ కాదంటే... మెచ్యూర్ అయినప్పుడు తనను అందరూ ప్రత్యేకంగా చూడటం వల్ల తనలో సిగ్గు పెరిగి ఉండవచ్చు. కారణం తెలియాలంటే తనతో మాట్లాడి తీరాల్సిందే. అది సిగ్గో భయమో మరేదైనా కారణమో తెలిస్తే దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయవచ్చు. మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చాలా అల్లరివాడు. ఇల్లు పీకి పందిరేసేవాడు. అయితే చదువులో ఎప్పుడూ ముందుండేవాడు కాబట్టి ఏమీ అనేవాళ్లం కాదు. అయితే ఏడో తరగతి పూర్తయ్యాక తనలో బాగా మార్పు వచ్చింది. ఒక్కసారిగా సెలైంట్ అయిపోయాడు. చదువు మీద కూడా అశ్రద్ధ కనిపిస్తోంది. ఏమైందని అడిగినా చెప్పడం లేదని డాక్టర్‌కి చూపించాం. ఏడీహెచ్‌డీ అన్నారు. నాకు తెలిసి ఆ సమస్య వచ్చిన పిల్లలు హైపర్‌గా ఉంటారు. కానీ వీడు డల్ ఎందుకయ్యాడు అని అడిగితే ఇలాక్కూడా జరుగుతుంది అన్నారు. అది నిజమేనా? వాడికిప్పుడు ఏ చికిత్స చేయాలి? - వి.రాజేంద్రప్రసాద్, సికింద్రాబాద్ ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలంతా హైపర్ యాక్టివ్‌గా ఉండాలని లేదు. కొంతమందికి కేవలం కాన్సన్ట్రేషన్ ప్రాబ్లెమ్ ఉంటుంది. వీళ్లు చిన్నప్పట్నుంచీ చదువు మీద శ్రద్ధ చూపలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ హైపర్ యాక్టివ్‌గా ఉండరు. ఇంకొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. చదువు మీద కూడా శ్రద్ధ చూపలేరు. అయితే కొందరు పెద్దయ్యాక వాళ్లలో హైపర్ యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ ప్రాబ్లెమ్ మాత్రమే మిగులుతుంది. అలాగే కొంతమంది పిల్లలకు చిన్నప్పుడు మంచి మార్కులే వస్తాయి. తర్వాత తగ్గిపోతాయి. కారణం... చిన్న క్లాసెస్‌లో ఎక్కువసేపు కూర్చుని చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి, పెద్ద క్లాసెస్‌కి వెళ్లేసరికి ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేక పోతుంటారు. అందుకే మార్కులు తగ్గుతాయి. కాబట్టి బాబును బద్ధకస్తుడనో మొద్దు అనో విసుక్కోవద్దు. చైల్డ్ సైకియాట్రిస్టుతో మందులు ఇప్పించండి. బిహేవియరల్ థెరపీ చేయించండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్