
మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) పుష్ప-2తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మళయాళంలో హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ..ఈ చిత్రంతోనే ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా చెరగని ముద్ర వేశాడు. అందుకు తన భార్యే కారణం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఫహాద్. ఆయన ఇటీవలే ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్(ADHD (Attention Deficit Hyperactivity Disorder))) సమస్య బారినపడ్డాడు.
ఇలా భార్యభర్తల్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారినడితే ఒక్కసారిగా సంసారంలో గందగోళం ఏర్పడుతుంది. అయితే ఆ పరిస్థితి ఎదురవ్వకుండా తన భార్య తీసుకున్న అనుహ్యమైన నిర్ణయం తమ దాంపత్యం మరింత బలపడేలా చేసిందంటూ భార్య నజ్రియా నజీమ్(Nazriya)పై ప్రశంసల జల్లు కురిపించాడు. మరీ అర్థాంగికి అసలైన అర్థ ఇచ్చేలా ఫహద్ భార్య తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దామా..
నజ్రియా ప్రపోజ్ చేయడంతోనే..
2014లో రూపొందిన మలయాళ చిత్రం ‘బెంగళూరు డేస్’ షూటింగ్‌లో కలుసుకున్న వీరు.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొన్ని నెలల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట.. అదే ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు.అయితే ఈ ఇద్దరిలో ముందుగా ప్రపోజ్ చేసింది నజ్రియానే. బెంగళూరు డేస్ చిత్రం షూటింగ్‌లోనే ఓ రోజు నజ్రియానే ఫహద్ దగ్గరికి వచ్చి.. ‘నన్ను పెళ్లి చేసుకో.. నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా..’ అని ప్రపోజ్ చేసింది.
అది కొత్తగా అనిపించి వెంటనే అందుకు సమత్తం తెలిపాడు ఫహాద్. అలా ఈ ఇద్దరి ప్రేమ పెళ్లిపీటలెక్కింది. అయితే ఫహద్ మాత్రం తన భార్యే ముందు ప్రపోజ్ చేసిందంటూ తెగ సంబరపడిపోతాడు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారాన్ని చూసి విధి పరీక్ష పెట్టాలనుకుందో ఏమో..!. ‘ఫహద్‌కు గతేడాది ఏడీహెచ్‌డీ ఉందని నిర్ధారణ అయింది.
ఓపికనే ఆయుధంగా..
అయితే నజ్రియా గాబరాపడిపోలేదు. తన భర్త ఈ సమస్యలను అధిగమించేలా తగిన ప్రోత్సహాన్ని అందించింది తమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకుంది. ఈ మానసిక సమస్య తనలో ఎప్పటి నుంచో ఉండొచ్చు. కానీ ఇప్పుడిలా బయటపడింది. అది తమ జీవితం భాగమైపోతుందే తప్ప కొత్తగా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని ధీమగా చెబుతోంది నజ్రియా.
"దానికి మా సంతోషాన్ని ఆవిరి చేసే అవకాశం ఇవ్వను. మరింతం అన్యోనంగా ఉండి..ఆ మానసిక పరిస్థితిని తరిమికొట్టేలా తన భర్తకు సహకరించి, ఓపిగ్గా వ్వవహరిస్తానంటోంది". నజ్రియా. అర్థాంగి అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా నిలిచింది నజ్రియా. ప్రతి బంధకంలా ఎదురయ్యే పరిస్థితులను ఆకళింపు చేసుకుని తగిన విధంగా కొద్దిపాటి మార్పులు చేసుకుంటే బంధాలు విచ్ఛిన్నం కావని చేసి చూపించింది నజ్రియా.
ఏడీహెచ్‌డీ అంటే..
అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనేది ఒక న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడే వ్యక్తికి శ్రద్ధ చూపడం, ఉద్రేకపూరిత ప్రవర్తనలను నియంత్రించడం, వారి ఆలోచనలను ట్రాక్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది ఆందోళన , డిప్రెషన్ లేదా ఇతర మానసిక అనారోగ్య లక్షణాల మాదిరిగానే ఉంటాయి .
లక్షణాలు..
- అనూహ్య మానసిక కల్లోలం కలిగి ఉంటారు
- పనిలో నిర్లక్ష్యం
- అవతలి వ్యక్తి మాట్లాడితే వినాలనిపించకపోవడం
- సూచనలను అనుసరించకపోవడం లేదా పనులను పూర్తి చేయకపోవడం
- కార్యకలాపాలను నిర్వహించ లేకపోవడం
- పనిలో నిరంతర మానసిక శ్రమను నివారించండి
- అసహనం
- నిద్రలేమి వంటి సమస్యలు
- అతిగా మాట్లాడటం
నివారణ: కేవలం మానసిక నిపుణుల కౌన్సిలింగ్, ఇంట్లో వాళ్ల సహకారంతో దీన్నుంచి బయటపడగలుగుతారు.
(చదవండి: లక్షల వేతనాన్ని వద్దునుకుని సివిల్స్‌కి ప్రిపేరయ్యింది..కట్‌చేస్తే..!)