స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ కథలో హీరోయిన్ రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విలన్ ఎవరనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా చివరాఖరకు మలయాళ స్టార్ పేరును ఖరారు చేశారు.
జాతీయ అవార్డు గ్రహీత ఫహద్ ఫాజిల్ పుష్పలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన అతడికి ఇదే తొలి తెలుగు చిత్రం. ఇతడు హీరోయిన్ నజ్రియా భర్తగానూ సుపరిచితుడే. అసలే బన్నీకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఇక విలన్‌ను కూడా అదే ఇండస్ట్రీ నుంచి ఎంపిక చేసుకోవడంతో సినిమాకు మరింత హైప్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆగస్టు 13న విడుదల కానుంది. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో పుష్పపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
Welcoming #FahadhFaasil on board for the biggest face-off 😈@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie #VillainOfPushpa #Pushpa
— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2021
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/ndweB09rXi
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment