
ప్రముఖ హీరో కమల్ హాసన్.. బిగ్ బాస్ షో నుంచి తప్పుకొన్నాడు. తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పాడు. త్వరలో తెలుగు, తమిళంలో కొత్త సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో కమల్ ట్వీట్ ఇప్పుడు అభిమానులకు షాకిచ్చింది.
(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?)
'ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్‌మెంట్స్ వల్ల రాబోయే బిగ్‌బాస్ సీజన్‌కి హోస్టింగ్ చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నా. ఈ షో ద్వారా ఇంటింటికీ చేరువైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలా బిగ్ బాస్ తమిళ షోని భారతీయ టీవీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్‌గా నిలిపారు. హోస్ట్‌గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఈ క్రమంలోనే భాగమైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు' అని కమల్ హాసన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.
రీసెంట్‌గా 'కల్కి'లో విలన్‌గా ఆకట్టుకున్న కమల్.. 'భారతీయుడు 2'తో హీరోగా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఈయన చేతిలో ప్రస్తుతం థగ్ లైఫ్, భారతీయుడు 3 సినిమాలు ఉన్నాయి. 'కల్కి 2' ఉంది కానీ అదెప్పుడో సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదు. కమల్ తప్పుకొన్నాడు సరే మరి ఈయన స్థానాన్ని భర్తీ చేసే కొత్త హోస్ట్ ఎవరా అనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉండగా తెలుగులో మాత్రం నాగార్జునే కొత్త సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))
என்றும் உங்கள் நான்.@vijaytelevision pic.twitter.com/q6v0ynDaLr
— Kamal Haasan (@ikamalhaasan) August 6, 2024
Comments
Please login to add a commentAdd a comment