తమన్నా ఐటమ్ సాంగ్.. ఫుల్ వర్షన్ వచ్చేసింది! | Tamannaah Bhatia's 'Aaj Ki Raat' full version out on YouTube | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: తమన్నా ఐటమ్ సాంగ్.. ఫుల్ వర్షన్ వచ్చేసింది!

Published Mon, Oct 28 2024 3:10 PM | Last Updated on Mon, Oct 28 2024 3:58 PM

Tamannaah Bhatia's 'Aaj Ki Raat' full version out on YouTube

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. జైలర్ మూవీలో తనదైన గ్లామర్‌, డ్యాన్స్‌తో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్త్రీ-2 చిత్రంలోనూ మెరిసింది. అజ్‌ కీ రాత్‌ అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. శ్రద్దాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

తాజాగా ఈ సాంగ్‌ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ఈ పాట విడుదల చేయగా.. రెండు నెలల్లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం కట్ చేసిన సీన్స్‌ను కలిపి తాజాగా ఈ పాటను రీ రిలీజ్ చేశారు. అజ్‌ కీ రాత్‌ ఫుల్ సాంగ్‌ అక్టోబర్ 24న యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చింది.

కాగా.. 2018లో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొచ్చారు. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement