జైలర్‌ తర్వాత మరో ఐటమ్‌ సాంగ్‌లో తమన్నా..! | Heroine Tamannaah Bhatia Coming With Another Item Song In Bollywood | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: ఐటమ్‌ గర్ల్‌గా తమన్నా.. సాంగ్ వచ్చేసింది!

Published Wed, Jul 24 2024 6:58 PM | Last Updated on Wed, Jul 24 2024 8:10 PM

Heroine Tamannaah Bhatia Coming With Another Item Song In Bollywood

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది జైలర్‌ మూవీలో ఐటమ్‌ సాంగ్‌తో అలరించిన భామ.. ఇటీవల ఎక్కువగా ఐటమ్‌ సాంగ్స్‌తోనే మెప్పిస్తోంది. తాజాగా స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ మూవీ నుంచి ఆజ్‌ కీ రాత్‌ అనే ఐటమ్‌ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో తమన్నా భాటియా తన అందం, డ్యాన్స్‌తో అభిమానులను కట్టిపడేసింది. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్‌ రావు జంటగా నటిస్తున్నారు.  

ఈ మూవీని హారర్-కామెడీ చిత్రంగా తెరకెక్కిచారు. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా.. దినేశ్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో పంకడ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement