'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం? | Bigg Boss Telugu 8 Day 2 Promo First Nominations | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Promo: నామినేషన్స్ రచ్చ షురూ.. ఆ ఇద్దరే టార్గెట్?

Sep 3 2024 10:39 AM | Updated on Sep 3 2024 12:07 PM

Bigg Boss Telugu 8 Day 2 Promo First Nominations

బిగ్‌బాస్ షోలో నామినేషన్ రచ్చ మొదలైంది. ఈసారి కెప్టెన్ ఎవరు ఉండరని చెప్పారు. ఆ స్థానంలో చీఫ్ ఉంటారని చెప్పి కొన్ని గేమ్స్ పెట్టగా నిఖిల్, యష్మి, నైనిక చీఫ్స్‌గా ఎంపికయ్యారు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం తొలి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇదంతా మంగళవారం రాత్రి ప్రసారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.

ప్రోమో విషయానికొస్తే.. ముగ్గురు చీఫ్స్ ఆసనాల్లో కూర్చుని ఉంటారు. మిగిలిన వాళ్లలో ఒక్కో హౌస్‌మేట్ తలో ఇద్దరిని నామినేట్ చేయాలి. అలా సోమవారం గొడవలతో హాట్ టాపిక్ అయిపోయిన సోనియా... బేబక్క, ప్రేరణని నామినేట్ చేసింది. సోనియా-బేబక్క మధ్య కుక్కర్ పంచాయతీ నడిచింది.

(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)

కిచెన్‌లో అజాగ్రత్తగా ఉన్నారని కారణం చెప్పిన సోనియా.. బేబ‍క్కని నామినేట్ చేసింది. దీంతో కుక్కర్ లోపల ప్రెజర్ ఉంటది. అది దిగేవరకు మనం ఆగాలని చెప్పి బేబక్క వివరణ ఇవ్వడం చూస్తుంటే ఈసారి నామినేషన్‌లో కుక్కర్ పంచాయతీ హైలైట్ అవ్వడం పక్కా అనిపిస్తోంది. కుక్కర్ పనిచేయకపోతే తానేం చేయనని బేబక్క అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరోవైపు మణికంఠ.. శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడిచింది. చివర్లో యష్మి పరుగెత్తుకుంటూ వచ్చి కత్తిని బేబక్క ఫొటోపై గుచ్చడం చూస్తుంటే ఈ వారం మణికంఠ, బేబక్కపై ఎలిమినేషన్ అనే కత్తి వేలాడటం పక్క అనిపిస్తోంది. మిగతా వాళ్ల కంటే వీళ్లిద్దరే ఎక్కువ టార్గెట్ అవుతున్నారనిపిస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్‌ వివరాలు.. ఎక్కువ ఎవరికంటే..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement