ప్రియుడితో బ్రేకప్‌ చేసుకున్న లైగర్ భామ! | Aditya Roy Kapur and Ananya Panday BREAK UP After Nearly 2 Years | Sakshi
Sakshi News home page

షాకింగ్ డెసిషన్.. రెండేళ్ల బంధానికి లైగర్ భామ గుడ్‌ బై!

Published Sun, May 5 2024 11:55 AM | Last Updated on Sun, May 5 2024 12:58 PM

Aditya Roy Kapur and Ananya Panday BREAK UP After Nearly 2 Years

బాలీవుడ్‌లో మరో స్టార్‌ జంట బ్రేకప్‌ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో లవ్ బర్డ్స్‌గా ముద్ర వేసుకున్న జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. కొద్ది రోజులుగా వీరిద్దరు త్వరలోనే విడితునట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యం షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ జంట దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్‌ చేసుకున్నట్లు వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.

గతంలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ‍వేడుకలకు వీరిద్దరు హాజరయ్యారు. ఈ వేడుకల తర్వాత ఎక్కడా కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొని ముంబయికి తిరిగి వచ్చాక తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

అతని తెలిపిన వివరాలప్రకారం మార్చిలోనే ఆదిత్య, అనన్య విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనన్య పాండే తన కొత్త పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కాగా.. అనన్య పాండే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ జంట రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement