'బంగారమే' 'జాను'గా వస్తోంది.. ట్రైలర్‌ చూస్తారా? | Shraddha, Aditya OK Jaanu trailer out | Sakshi
Sakshi News home page

'బంగారమే' 'జాను'గా వస్తోంది.. ట్రైలర్‌ చూస్తారా?

Published Mon, Dec 12 2016 3:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

'బంగారమే' 'జాను'గా వస్తోంది.. ట్రైలర్‌ చూస్తారా?

'బంగారమే' 'జాను'గా వస్తోంది.. ట్రైలర్‌ చూస్తారా?

సరిగ్గా మూడేళ్ల కిందట 'ఆషికీ-2'తో ప్రేక్షకులను ప్రేమలోకంలో ముంచెత్తిన జోడీ ఆదిత్యరాయ్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌. గతంలో ప్రగాఢమైన ప్రేమకథతో అలరించిన ఈ జోడీ ఇప్పుడు 'ఓకే జాను' అంటూ హిందీ ప్రేక్షకులను పలుకరించబోతున్నది. సహజీవనం, ఆధునిక యువత మనోభావాలకు అద్దం పడుతూ ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' (తమిళంలో 'ఓకే కణ్మని') సినిమాకు ఇది రీమేక్‌.

దక్షిణాది భాషల్లో దుల్కర్‌ సల్మాన్‌, నిత్య మీనన్‌ జోడీ మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆదిత్య-శ్రద్ధ పెయిర్‌ కూడా ఇదే ప్రేమకథతో అభిమానుల మనస్సు దోచుకునేందుకు సిద్ధమవుతోంది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం, గుల్జార్‌ సాహిత్యంతో మణిరత్నం, కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఓకే జాను' ట్రైలర్‌ తాజాగా ఆన్‌లైన్‌ విడుదలైంది. దక్షిణాది 'ఓకే బంగారం' కన్నా కాస్తా ఘాటు ఎక్కువైనట్టు కనిపిస్తున్న 'ఓకే జాను' ట్రైలర్‌ నెటిజన్లను ఉర్రుతలూగిస్తోంది. మీరు ఓ లుక్‌ వేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement