OK Kanmani
-
'బంగారమే' 'జాను'గా వస్తోంది.. ట్రైలర్ చూస్తారా?
సరిగ్గా మూడేళ్ల కిందట 'ఆషికీ-2'తో ప్రేక్షకులను ప్రేమలోకంలో ముంచెత్తిన జోడీ ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్. గతంలో ప్రగాఢమైన ప్రేమకథతో అలరించిన ఈ జోడీ ఇప్పుడు 'ఓకే జాను' అంటూ హిందీ ప్రేక్షకులను పలుకరించబోతున్నది. సహజీవనం, ఆధునిక యువత మనోభావాలకు అద్దం పడుతూ ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' (తమిళంలో 'ఓకే కణ్మని') సినిమాకు ఇది రీమేక్. దక్షిణాది భాషల్లో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జోడీ మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆదిత్య-శ్రద్ధ పెయిర్ కూడా ఇదే ప్రేమకథతో అభిమానుల మనస్సు దోచుకునేందుకు సిద్ధమవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం, గుల్జార్ సాహిత్యంతో మణిరత్నం, కరణ్ జోహార్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఓకే జాను' ట్రైలర్ తాజాగా ఆన్లైన్ విడుదలైంది. దక్షిణాది 'ఓకే బంగారం' కన్నా కాస్తా ఘాటు ఎక్కువైనట్టు కనిపిస్తున్న 'ఓకే జాను' ట్రైలర్ నెటిజన్లను ఉర్రుతలూగిస్తోంది. మీరు ఓ లుక్ వేయండి. -
రెహ్మాన్ పక్కన పాడటం ఆస్కార్, గ్రామీతో సమానం
చెన్నై: స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ఆస్కార్, గ్రామీవంటి ఎన్నో అవార్డులతో సమానం అని ప్రముఖ నేపథ్య గాయని దర్శన అన్నారు. ఆయన పక్కనే ఉండి పాడటం అంటే ఇక వర్ణించరాని విషయం అంటూ మురిసిపోయారు. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఓకే కన్మణీ(తెలుగులో ఓకే బంగారం)కి రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళ తెలుగు భాషల్లో విడుదల కానుండగా ఇందులో మూడు తమిళపాటలు, రెండు తెలుగు పాటలను దర్శన పాడారు. మరో డ్యూయెట్ పాట మాత్రం రెహ్మాన్‌తో కలిసి పాడారు. ఈ నేపథ్యంలో ఆమె తన సంతోషాన్ని మీడియాకు వెలిబుచ్చారు. రెహ్మాన్ పక్కన తన పేరు ఉండటాన్ని ఊహించలేకపోతున్నానని, వర్ణించలేకపోతున్నానని అన్నారు. తనకు మాత్రం నిజంగా ఆస్కార్, గ్రామీ పురస్కారాలు పొందినట్లుగా ఉందని అభివర్ణించారు. -
మళ్ళీ మ్యాజిక్?
ప్రముఖ దర్శక - నిర్మాత మణిరత్నం కొంత విరామం తరువాత మళ్ళీ జనం ముందుకు వస్తున్నారు. కొంతకాలంగా సరైన విజయం కోసం చూస్తున్న ఈ సృజనశీలి గతంలో తనకు అచ్చివచ్చిన వినోదాత్మక ప్రేమకథల ఫార్ములానే మరోసారి ఆశ్రయించారు. ‘ఓ కాదల్ కన్మణి’ (సంక్షిప్తంగా ‘ఓ.కె. కన్మణి’) అంటూ స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ తాజా తమిళ చిత్రం ఏప్రిల్‌లో తమిళ ఉగాది నాడు జనం ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ చిత్రం తమిళ ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేశారు. దల్క్వెర్ సల్మాన్, నిత్యా మీనన్‌లు హీరో హీరోయిన్లు. ఆర్కిటెక్ట్ విద్యార్థినిగా నిత్యా మీనన్ వినూత్న పాత్ర పోషిస్తుంటే, ప్రసిద్ధ భారతీయ ఆర్కిటెక్ట్ బి.వి. దోషీ ఆమెకు ప్రొఫెసర్‌గా నటిస్తున్నారు. ‘రోజా’ ద్వారా తనకు సినీ జీవితమిచ్చిన మణిరత్నమ్ మీద గురుభావంతో ఈ సినిమాకు కూడా ఏ.ఆర్. రహ్మాన్ అద్భుతమైన సంగీతమిచ్చారు. చిత్ర సంగీతం గురించి సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు నిర్వహించిన ఈ చిత్రం తమిళ, మలయాళాలతో పాటు తెలుగులోనూ రానుంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమా కోసం సీతారామశాస్త్రి పాటలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. చెన్నైతో పాటు అహ్మదాబాద్, ముంబయ్‌లలో కూడా షూటింగైన ఈ చిత్రంతో మణిరత్నం మ్యాజిక్ పునరావృతమవుతుందా?