నటి కోసం గొడవ పడలేదు..ఇదిగో ప్రూఫ్‌: హీరో | Farhan akhtar posts picture with Aditya | Sakshi
Sakshi News home page

నటి కోసం గొడవ పడలేదు..ఇదిగో ప్రూఫ్‌: హీరో

Published Sun, Apr 9 2017 3:11 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

నటి కోసం గొడవ పడలేదు..ఇదిగో ప్రూఫ్‌: హీరో

నటి కోసం గొడవ పడలేదు..ఇదిగో ప్రూఫ్‌: హీరో

నటి శ్రద్ధా కపూర్‌ కోసం బాలీవుడ్‌ హీరోలు ఫర్హాన్‌ అఖ్తర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌ గొడవపడ్డారంటూ గతవారం బాలీవుడ్‌లో రూమర్స్‌ తెగ చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్‌కు తెరదించుతూ తనదైన స్టైల్‌లో ఫర్హాన్‌ అఖ్తర్‌ తాజాగా వివరణ ఇచ్చాడు. ’వాళ్లు ఏదేదో అంటున్నారు కానీ ఇదిగో మేం ఇలా ఉన్నాం.. రిప్‌ రూమర్స్‌’ అంటూ ఆదిత్యరాయ్‌తో దిగిన ఫొటోను ఫర్హాన్‌ ట్వీట్‌ చేశాడు. గత రాత్రి తాము ఆనందంగా గడిపామంటూ చెప్పాడు.

మహేశ్‌ భట్‌ కుటుంబం పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలో శ్రద్ధా కోసం ఫర్హాన్‌, ఆదిత్య గొడవ పడ్డారని గతవారం బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. భట్‌ కుటుంబ వేడుకలకు 'ఆషికీ-2' స్టార్స్‌ ఆదిత్య, శ్రద్ధ జంటగా కలిసి హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, కొంతకాలం వీరు డేటింగ్‌ చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇలా ఎక్స్‌ లవర్స్‌ కలిసి వచ్చి పార్టీలో హల్‌చల్‌ చేయడం ఫర్హాన్‌ అఖ్తర్‌కు నచ్చలేదట. 'రాక్‌ ఆన్‌ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్‌ ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు ఇప్పటివరకు ఈ కథనాలను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ చేయలేదు.

ఈ నేపథ్యంలో శ్రద్ధ, ఆదిత్యతో కలిసి ఈ పార్టీకి రావడం, సన్నిహితంగా మెలుగడం ఫర్హాన్‌ కు కోపం తెప్పించిందని, అందుకే ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్‌ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని అప్పట్లో కథనాలు వచ్చాయి. శ్రద్ధ విషయంలో ఇద్దరు హీరోల గొడవ జరిగి.. వైరం కొనసాగుతున్నదని వస్తున్న కథనాలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టేందుకు ఫర్హాన్‌ తనదైన స్టైల్‌లో ఈ ట్వీట్‌తో రిప్లై ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement