ఆ పాటకు 15 కోట్ల వ్యూస్..! | Ok Jaanu Hamma Hamma Song gets 153 Million Views | Sakshi
Sakshi News home page

ఆ పాటకు 15 కోట్ల వ్యూస్..!

Published Sat, Mar 18 2017 2:04 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

ఆ పాటకు 15 కోట్ల వ్యూస్..!

ఆ పాటకు 15 కోట్ల వ్యూస్..!

ఆషికీ 2 జంట మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఓకె జాను సినిమా కోసం రెండో సారి జతకట్టిన ఈ జోడి, సక్సెస్ పరంగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ సినిమా లోని ఓ పాట అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ మూడు నెలలకు ముందు ఓ రిమిక్స్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన హమ్మ హమ్మ పాటను ఓకె జాను సినిమా కోసం రిమిక్స్ చేశారు. ఈ రొమాటింక్ సాంగ్ వీడియోను డిసెంబర్ 15న యూట్యూబ్లో విడుదల చేశారు.

శ్రద్దా అందాలకు రెహమాన్ మ్యూజిక్ తొడవ్వటంతో ఈ పాట రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ పాట యూట్యూబ్ వ్యూస్లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పాటను 15 కోట్ల 33 లక్షల మందికిపైగా చూశారు. ఈ విషయాన్ని సోని మ్యూజిక్ ఇండియా సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో వెల్లడించింది. 150 మిలియన్లకు పైగా వ్యూస్తో హమ్మ హమ్మ మూడో స్థానంలో నిలవగా బేఫికర్ లోని నషే సి చద్కు 20 కోట్ల , బార్ బార్ దేఖో సినిమాలోని కాలా చెష్మా 20 కోట్ల 2 లక్షల వ్యూస్తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement