Ok Jaanu
-
రీమిక్స్‌లు దారుణంగా ఉంటున్నాయి
ప్రస్తుతం బాలీవుడ్లో రీమిక్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. దాదాపు ప్రతీ సినిమాలో ఏదో ఒక పాపులర్ పాట రీమిక్స్ వెర్షన్ వినిపిస్తోంది. ఈ రీమిక్స్ పాటల ట్రెండ్ గురించి మీరేమంటారు? రీమిక్స్ అయిన మీ పాటలు మీకు నచ్చాయా? అని ఎ.ఆర్. రెహమాన్‌ని అడిగితే ఇలా సమాధానమిచ్చారాయన. ‘‘ఓకే జాను’లో ‘హమ్మా.. హమ్మా..’ (‘బొంబాయి’ సినిమాలోని హమ్మా.. హమ్మా’ పాట) ను పాట బాగా రీమిక్స్ చేశారు. ఆ తర్వాత రీమిక్స్ అయిన పాటలు చాలావరకూ దారుణంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు రీమిక్స్ పాటను నన్ను ప్రమోట్ చేయమంటారు కూడా. ‘నాకు ఈ పాట నచ్చలేదు. ఒకవేళ సపోర్ట్ చేస్తే కచ్చితంగా విమర్శలకు గురవుతాను’ అని చెప్పాను. రీమిక్స్ చేసే ఫాస్ట్ ఫుడ్ దారిని ఎంచుకోకుండా కథకు అవసరమయ్యే పాటను తయారు చేసుకోవడం బెస్ట్’’ అన్నారు రెహమాన్. -
ఆ పాటకు 15 కోట్ల వ్యూస్..!
ఆషికీ 2 జంట మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఓకె జాను సినిమా కోసం రెండో సారి జతకట్టిన ఈ జోడి, సక్సెస్ పరంగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ సినిమా లోని ఓ పాట అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ మూడు నెలలకు ముందు ఓ రిమిక్స్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన హమ్మ హమ్మ పాటను ఓకె జాను సినిమా కోసం రిమిక్స్ చేశారు. ఈ రొమాటింక్ సాంగ్ వీడియోను డిసెంబర్ 15న యూట్యూబ్‌లో విడుదల చేశారు. శ్రద్దా అందాలకు రెహమాన్ మ్యూజిక్ తొడవ్వటంతో ఈ పాట రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ పాట యూట్యూబ్ వ్యూస్‌లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పాటను 15 కోట్ల 33 లక్షల మందికిపైగా చూశారు. ఈ విషయాన్ని సోని మ్యూజిక్ ఇండియా సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో వెల్లడించింది. 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో హమ్మ హమ్మ మూడో స్థానంలో నిలవగా బేఫికర్ లోని నషే సి చద్కు 20 కోట్ల , బార్ బార్ దేఖో సినిమాలోని కాలా చెష్మా 20 కోట్ల 2 లక్షల వ్యూస్‌తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. #TheHummaSong crosses 150M views! @DharmaMovies @karanjohar @arrahman @Its_Badshah @JubinNautiyal @tanishkbagchi https://t.co/DwJVjJxGKS pic.twitter.com/vaJZPSCnI1 — Sony Music India (@sonymusicindia) 14 March 2017 -
బాలీవుడ్లో బంగారం మెరుస్తుందా ?
-
తెలుగులో బంగారం..హిందీలో జాను!
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తెలుగులోనే కాదు తమిళంలో (‘ఓకే కన్మణి’) కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ‘ఓకే జాను’ పేరుతో బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యా రాయ్, శ్రద్ధా కపూర్ జంటగా షాద్ అలీ దర్శకత్వంలో ప్రముఖ దర్శక- నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఓకే జాను’ని విడుదల చేస్తున్నట్లు కరణ్ ప్రకటించారు. అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.