ఎ.ఆర్. రెహమాన్
ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమిక్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. దాదాపు ప్రతీ సినిమాలో ఏదో ఒక పాపులర్ పాట రీమిక్స్ వెర్షన్ వినిపిస్తోంది. ఈ రీమిక్స్ పాటల ట్రెండ్ గురించి మీరేమంటారు? రీమిక్స్ అయిన మీ పాటలు మీకు నచ్చాయా? అని ఎ.ఆర్. రెహమాన్‌ని అడిగితే ఇలా సమాధానమిచ్చారాయన. ‘‘ఓకే జాను’లో ‘హమ్మా.. హమ్మా..’ (‘బొంబాయి’ సినిమాలోని హమ్మా.. హమ్మా’ పాట) ను పాట బాగా రీమిక్స్ చేశారు.
ఆ తర్వాత రీమిక్స్ అయిన పాటలు చాలావరకూ దారుణంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు రీమిక్స్ పాటను నన్ను ప్రమోట్ చేయమంటారు కూడా. ‘నాకు ఈ పాట నచ్చలేదు. ఒకవేళ సపోర్ట్ చేస్తే కచ్చితంగా విమర్శలకు గురవుతాను’ అని చెప్పాను. రీమిక్స్ చేసే ఫాస్ట్ ఫుడ్ దారిని ఎంచుకోకుండా కథకు అవసరమయ్యే పాటను తయారు చేసుకోవడం బెస్ట్’’ అన్నారు రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment