సూపర్ స్టార్ రజనీకాంత్, ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కలెక్షన్ల పరంగానే కాక మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసింది. ఈ వరుసలో ముత్తు, శివాజీ, రోబో, రోబో 2.0 వున్నాయి. ఈ లెజెండరీల కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కు పండగే. అయితే ఇదంతా తెరపైన మనకి కనపడేవి.కానీ దీని వెనుక చాలా వ్యయ ప్రయాసలు,కష్టాలు, దగున్నాయని అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు ఏ ఆర్ రెహమాన్.
ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. రజనీకాంత్ సినిమాలకు పనిచేసిన రోజులు అంత ఆహ్లాదకరంగా ఉండేవి కాదని, ఆయన సినిమాకు పనిచేయడమంటే నరకంలా భవించేవాడినని చెప్పాడు. ఇప్పట్లో కొంచెం నయం అని, అప్పట్లో రజనీకాంత్ సినిమాలకు చాలా వరకు దీపావళికి విడుదలయ్యేవి. సినిమాకు పాటలు, బీజీఎం అధిరిపోవాలని అందరూ అనేవాళ్ళు. పైగా ఆయన చిత్రాలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఒత్తిడి కూడా అధికంగా వుండేదని, ఓ రకంగా చాలా ఒత్తిడి కూడా ఉండేదని చెప్పుకొచ్చాడు రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment