![Pushpa Director Sukumar's Daughter Sukriti Veni Bandreddi Song Goes Viral](/styles/webp/s3/article_images/2024/05/23/su.jpeg.webp?itok=DzkzmtDx)
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే పుష్ప పుష్ప అంటూ ఫ్యాన్స్‌ను ఊపేసే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ షూ స్టెప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప-2 త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే సుకుమార్- తబిత దంపతులకు సుకృతి వేణి అనే ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమెకు ఉత్తమ బాలనటిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. గాంధీ తాత చెట్టు అనే చిత్రానికి ఈ అవార్డ్ దక్కించుకున్నారు. అయితే సుకృతి సింగర్ కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో సాంగ్ పాడిన వీడియోను సుకుమార్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకున్నారు. నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ సుకుమార్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా సుకృతి పాడిన యూట్యూబ్ లింక్‌ను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం సుకృతి పాడిన సాంగ్ సంగీత ప్రియులను అలరిస్తోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment