నటుడిగా మారిన రెహమాన్‌ | AR Rahman Guest Role In Mohanlal Aarattu Movie | Sakshi
Sakshi News home page

నటుడిగా మారిన రెహమాన్‌

Published Mon, Mar 22 2021 12:28 AM | Last Updated on Mon, Mar 22 2021 11:40 AM

AR Rahman Guest Role In Mohanlal Aarattu Movie - Sakshi

సంగీతదర్శకుడిగా పలు మధురమైన పాటలను వినిపిస్తుంటారు ఏఆర్‌ రెహమాన్‌. ఆ పాటల్లో నటీనటులు అద్భుతంగా నటించారు. ఇప్పుడు రెహమాన్‌  నటుడిగా మారారు. మోహన్‌ లాల్‌ హీరోగా రూపొందుతున్న ‘ఆరట్టు’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్ర చేశారు రెహమాన్‌.

ఈ యాక్షన్‌  కామెడీ మూవీకి బి. ఉన్నికష్ణన్‌  డైరెక్టర్‌. ‘‘మ్యూజిక్‌ మ్యాస్ట్రో రెహమాన్‌ తో షూట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ లొకేషన్‌  ఫోటోను షేర్‌ చేశారు మోహన్‌ లాల్‌. ఈ చిత్రం ద్వారా శ్రద్ధా శ్రీనాథ్‌ మలయాళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది నవంబరులో సినిమా విడుదల కానుంది.
చదవండి: ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement