unni krishnan
-
'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
K Unni Krishnan About Major Movie And Sandeep Mother Get Emotional: 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడవి శేష్ నటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేజర్. ఈ సినిమా చూసి రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయం తెలిపారు. 'సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారు. చాలా మంచి సినిమా తెరకెక్కించారు. చిత్రబృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ ఎంతో బాగుంది. మా దుఃఖాన్ని మరిచేలా చేసింది. ఒక మాట చెబుతాను. సందీప్ చనిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదు. అతని తుదిశ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. అది ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నా కెరీర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాను. నేను సందీప్‌తో కలిసి హైదరాబాద్‌లో జీవించాను, అతనితో మంచి సమయం గడిపాను. ఇప్పుడు మై బాయ్స్‌తో ( సినిమా టీమ్) మంచి సమయం గడుపుతున్నాను. నేను హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్‌కు మళ్లీ మళ్లీ వస్తాను.' అని సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ పేర్కొన్నారు. 'Sandeep has fought till his last breath & beyond. He continues to motivate all of us' Mr. Unnikrishnan at the special premieres in Hyderabad.#MajorTheFilm 🇮🇳@AdiviSesh @saieemmanjrekar #SobhitaD @SashiTikka @urstrulyMahesh @SonyPicsIndia @GMBents @AplusSMovies pic.twitter.com/GIuN5w4uFO — Major (@MajorTheFilm) June 3, 2022 మేజర్ సినిమా గురించి కే. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఆ మాటలు విని సందీప్ తల్లి ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్ కన్నిటీపర్యంతమయ్యారు. కాగా సినిమా విడుదలకు ముందు రోజు సందీప్ తల్లిని అడవి శేష్ ఆత్మీయంగా ఆలీంగనం చేసుకున్నాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'అంకుల్, అమ్మ మీ ఇద్దరి కోసం రేపు మేజర్ సినిమా విడుదల కాబోతుంది' అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
తొలిపాటకే నేషనల్ అవార్డు.. ఈ సింగర్ గుర్తున్నాడా?
సంగీత సాధన.. ఆపై వినసొంపైన గాత్రంతో అలరించే గాయకులు కొద్దిమందే ఉన్నారు. కానీ, తమది కాని భాషల్లో అలరించిన.. అలరిస్తున్న గాయకులు కొందరు ఉన్నారు. వాళ్లలో చెప్పుకొదగ్గ సింగర్ ఉన్నికృష్ణన్. తొలి పాటకే జాతీయ అవార్డు అందుకున్న ఘనత ఈయన ఖాతాలో ఉంది. 90, 2000 దశకంలో ఆయన పాడిన పాటలన్నీ దాదాపు ఛార్బస్టర్లే. ఆయన గొంతు నుంచి వెలువడిన ప్రేమ, రొమాంటిక్, విషాద గీతాలు.. ఈనాటికీ అలరిస్తూనే ఉన్నాయి. అన్నట్లు ఇవాళ ( జులై 9) ఉన్నికృష్ణన్ 55వ పుట్టినరోజు. సాక్షి, వెబ్‌డెస్క్: 1966 జులై 9న కేరళలో పలక్కడ్‌లో జన్మించాడు పరక్కల్ ఉన్నికృష్ణన్. కానీ, వీళ్ల ఫ్యామిలీ నేపథ్యం మాత్రం తమిళనాడులోనిది. మద్రాస్‌లో ప్రముఖ ఆయుర్వేద చికిత్సాలయం కేసరి కుటీరంను నిర్వహించింది ఉన్ని ముత్తాత కేసరి. ఈయన తెలుగు మహిళా మ్యాగజైన్ గృహలక్ష్మీ ప్రమోటర్ కూడా. పన్నెండేళ్ల వయసులో కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఉన్నికృష్ణన్.. చదువులో పడి ఆ తర్వాత పక్కనపెట్టేశాడు. కానీ, కెరీర్ ఎదుగుతున్న టైంలో అనూహ్య నిర్ణయంతో ఆయన మళ్లీ పాటల వైపు అడుగులేశాడు. తొలిపాటకే నేషనల్ అవార్డు.. ఉన్నికృష్ణన్ తొలిసారి పాడిన పాట ‘కాదలన్’1994(తెలుగులో ప్రేమికుడు) చిత్రంలోని ‘ఎన్నవలే అది ఎన్నవలే’(ఓ చెలియా నా ప్రియ సఖియా). ఈ పాటతోపాటు అదే ఏడాది రిలీజ్ అయిన ‘పవిత్ర’ లోని ‘ఉయిరుమ్ నీయే..’ పాటకు(ఇదీ రెహమాన్ బాణీ కట్టిందే) గానూ సంయుక్తంగా నేషనల్ బెస్ట్ సింగర్‌గా అవార్డు దక్కింది ఉన్నికృష్ణన్‌కి. ఇక అప్పటి నుంచి తన మధురమైన గాత్రంతో ఎన్నో మరిచిపోలేని పాటలను పాడారు ఆయన. విశేషం ఏంటంటే.. ఉన్నికృష్ణన్ కూతురు ఉత్తర, పదేళ్ల వయసులో తన తొలిసాంగ్(2014లో వచ్చిన మళయాళం మూవీ శైవంలోని అళగు.. సాంగ్) ద్వారా నేషనల్ అవార్డు దక్కించుకుంది. అలా తండ్రీకూతుళ్లిద్దరూ డెబ్యూ సాంగ్‌తోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. నాలుగు భాషల్లో.. తమిళ, తెలుగు, మళయాళం, కన్నడం.. ఇలా నాలుగు భాషల్లో కలిపి నాలుగు వేల పాటలు పాడారాయన. హిందీలో ఒకేఒక్క పాట.. అది కూడా అపరిచిత్(అపరిచితుడు హిందీ డబ్)లో ‘కుమారి’ పాటను పాడారు. ఇక తెలుగులో ‘ప్రేమికుడు’తో మొదలైన ఆయన పాట.. ఇద్దరులో ‘శశివదనే’, రక్షకుడులో ‘సోనియా సోనియా’, జీన్స్, ప్రేమికుల రోజు, ప్రేమకు వేళాయెరా, కలిసుందాం రా, మా అన్నయ్య, రిథమ్, గోదావరి, అనుమానాస్పదం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రంగం.. ఇలా స్ట్రయిట్, డబ్బింగ్ సినిమాలెన్నింటితోనో ఆయన గాన ప్రయాణం కొనసాగింది. ఆయన వాయిస్‌లోని డెప్త్.. ఆ పాట పాడింది ఆయనే అని గుర్తు పట్టేలా చేస్తుంది వినేవాళ్లను. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల ద్వారా ఎక్కువగా ఆయన పాటలు పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ‘ఉగాది’ మూవీలో దాదాపు అన్నిపాటలు ఉన్నినే పాడారు. క్యాసెట్ల రికార్డింగ్‌ల టైంలో ఈయన పాటలు ఎక్కువగా సేల్ అయ్యేవి. సినిమాలు తగ్గి.. సినిమాల్లో యువ గాయకుల హవాతో ఈ మధుగాయకుడికి అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. 2012 టైంలో దేవుడి పాటలతో బిజీగా గడిపారు ఆయన. పలు టీవీ సీరియల్స్‌కు సైతం ఆయన గానం అందించారు. ఆ తర్వాత సింగింగ్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ హుందా పొజిషన్లో కనిపించారు. వెస్ట్రన్ మ్యూజిక్ డామినేషన్ కొనసాగుతున్న రోజుల్లో క్లాసిక్ మ్యూజిక్‌ను నిలబెట్టాలనే ఆయన తాపత్రయం పలు షోల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది కూడా. క్లాసికల్ ఫ్యామిలీ ఉన్ని చదువు మొత్తం చెన్నైలోనే పూర్తైంది. ఆ తర్వాత 1987 నుంచి ఏడేళ్లపాటు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి.. ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేశాడు. చిన్నతనంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఉన్ని.. సంగీత కళానిధి డాక్టర్ విశ్వనాథన్ స్ఫూర్తితో గాయకుడిగా రాణించాలని నిర్ణయించుకున్నాడు. పలువురి శిష్యరికంలో మంచి గాయకుడిగా రాటుదేలాడు. స్టేజ్ షోలు ఇస్తున్న తరుణంలో.. ఈయన గాత్రం నచ్చడంతో కాదలన్ సినిమాకు అవకాశం ఇచ్చాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఉన్నికృష్ణన్ భార్య ప్రియ భరతనాట్యం కళాకారిణి. కూతురు ఉత్తర సింగర్‌గా రాణిస్తోంది. కొడుకు వాసుదేవ్ క్రికెట్లో రాణించడమే కాకుండా.. గాత్రంతోనూ అలరిస్తున్నాడు. మొత్తంగా కళతోనే ప్రయాణిస్తోంది ఉన్నికృష్ణన్ కుటుంబం. -
నటుడిగా మారిన రెహమాన్
సంగీతదర్శకుడిగా పలు మధురమైన పాటలను వినిపిస్తుంటారు ఏఆర్ రెహమాన్. ఆ పాటల్లో నటీనటులు అద్భుతంగా నటించారు. ఇప్పుడు రెహమాన్ నటుడిగా మారారు. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘ఆరట్టు’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్ర చేశారు రెహమాన్. ఈ యాక్షన్ కామెడీ మూవీకి బి. ఉన్నికష్ణన్ డైరెక్టర్. ‘‘మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్ తో షూట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ లొకేషన్ ఫోటోను షేర్ చేశారు మోహన్ లాల్. ఈ చిత్రం ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ మలయాళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది నవంబరులో సినిమా విడుదల కానుంది. చదవండి: ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) -
పలుకే బంగారమాయెగా
ఉన్నికృష్ణన్– అందరికీ పరిచితమైన పేరు.. ఉత్తర కృష్ణన్– ఈ పేరూ అందరికీ పరిచితమే.. ఇద్దరూ సంగీతంలో అభినివేశం ఉన్నవారే. ఇద్దరూ చలన చిత్రాలలో పాటలు పాడినవారే.శ్రీరామనవమి సందర్భంగా ఈ తండ్రికూతుళ్లు ‘పలుకే బంగారమాయెనా’ అనే రామదాసు కీర్తనను పాడి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. వారం కూడా పూర్తి కాకుండానే ఈ వీడియోను 20 లక్షలకు పైగా విని పరవశించారు. ఈ సందర్భంగా సాక్షి ఫోన్ ద్వారా సంభాషించింది. వివరాలు... మా అమ్మాయి పాడిన భక్తి గీతాలు, సినీ గీతాలు, పాశ్చాత్య సంగీతం వీడియోలకి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా రామదాసు కీర్తన పెట్టాలనుకున్నాం. ఎస్. జయకుమార్ అందుకు సహకరించారు. రామదాసు కీర్తనకు ప్రస్తుత పాశ్చాత్య ఆర్కెస్ట్రాను సమకూర్చారు. అంతకుముందే నేను మా అమ్మాయితో కలిసి వీడియో చేద్దామనుకున్నాను. ఇలా తండ్రికూతుళ్లు పాడటం చాలా అరుదు. మా అమ్మాయి ఉత్తరకి ఐదో ఏట నుంచే సుధారాజన్ దగ్గర సంగీతం నేర్పించాను. అమ్మాయి కర్ణాటక సంగీతం, సినిమా పాటలు, పాశ్చాత్య సంగీతం అన్నీ పాడుతోంది. అన్నిటికీ తోడు అమ్మాయి చదువుతున్న స్కూల్లో సంగీతానికి సంబంధించిన విశ్లేషణ, స్వరకల్పన, సంగతులు వేయటం నేర్పిస్తారు. అలా అన్నిచోట్లా సంగీతంతో ప్రయాణం చేస్తోంది. చదువును నిర్లక్ష్యం చేయకుండా సంగీతాన్ని నేర్చుకుంటోంది. నేను అమ్మాయి కలిసి పాడాలంటే మా ఇద్దరు శృతులు వేరు వేరు. అందువల్ల నేను పాడటానికి వెనకాడాను. అయినా ప్రయత్నిద్దామనుకున్నాను. మాకు ఆడియో పంపేశారు. నేను ఉత్తర బాగా సాధన చేశాం. నాకు తెలుగు రాదు కనుక దోషాలు లేకుండా పాడటం కోసం డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన ‘పలుకే బంగారమాయెనా’ కీర్తనను చాలాసార్లు విన్నాను. ఉచ్చారణ దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. అమ్మాయి కూడా తప్పులు పాడకుండా శిక్షణ ఇచ్చాను. అలాగే ఆయన బాణీలోనే పాడాం. ఇద్దరం సాధన చేసి, మా కెమెరాలో వీడియో తీశాం. అందులో వచ్చిన దోషాలను మళ్లీ సరిచేసుకున్నాం. అలా ఆ వీడియో తప్పులు లేకుండా రావటం కోసం ఇన్ని శ్రద్ధలు తీసుకున్నాం. మా అమ్మాయితో కలిసి మరిన్ని పాటలు పాడి, వీడియోలు చేయాలని కోరికగా ఉంది. రామదాసుదే ‘సీతా కల్యాణ వైభోగమే’ కీర్తన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శ్రీరామనవమి మాకు నిజంగా పండుగే. రామనామం పానకం వంటిది. ఆ నామాన్ని జపించడం మాకు సంతోషంగా ఉంది.– సంభాషణ: జయంతి -
హీట్స్‌లోనే చిత్రా నిష్క్రమణ
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మహిళల 1500 మీటర్ల విభాగంలో ఆసియా చాంపియన్, భారత రన్నర్ చిత్రా ఉన్నికృష్ణన్ తొలి రౌండ్ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన ఈ హీట్స్‌లో చిత్రా 4 నిమిషాల 11.10 సెకన్లలో గమ్యానికి చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. హీట్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచి సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయింది. గత ఏప్రిల్‌లో ఇదే వేదికపై ఆసియా చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాన్ని నెగ్గిన చిత్రా అదే ఫలితాన్ని ప్రపంచ చాంపియన్íÙప్లో పునరావృతం చేయలేకపోయింది. ఓవరాల్‌గా హీట్స్‌లో 35 మంది పాల్గొనగా చిత్రాకు 30వ స్థానం దక్కింది. టాప్–24లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. -
మంచి ఫ్రాడ్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన చిత్రం ‘మిస్టర్ ఫ్రాడ్’. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘గన్‌షాట్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సాయి ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై వెనిజండ్ల శ్రీరామమూర్తి, కల్లూరు శేఖర్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. ధనికుల వద్ద డబ్బు కొల్లగొట్టి పేదవాళ్లకు పంచి పెడుతుంటాడు హీరో. ఈ క్రమంలో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. నిధి, నిక్షేపాల కోసం హీరోతో పాటు ఇంకొందరు అన్వేషిస్తారు. అప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తిగా ఉంటాయి. మలయాళంలో ఈ చిత్రం 70కోట్లు వసూలు చేసింది. డబ్బింగ్ పనులు పూర్తయిన మా చిత్రాన్ని తర్వలోనే విడుదల చేయడానికి సన్నా హాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, నిర్వహణ: కె.కృష్ణ, విజయన్స్. -
బుల్లితెర నటికి దర్శకుడి లైంగిక వేధింపులు
బుల్లితెర నటిని దర్శకుడు లైంగికంగా వేధించిన ఘటన మళయాళ ఇండస్ట్రీని ఉలికిపడేలా చేసింది. ఉప్పం ములకుం సీరియల్ అక్కడ మోస్ట్ వ్యూయింగ్ సీరియల్. అందులో లీడ్ రోల్ పోషిస్తున్న నటి నిషా సారంగ్.. సీరియల్ దర్శకుడు ఆర్ ఉన్నికృష్ణన్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు.డైరెక్టర్ ఉన్నికృష్ణన్ గత కొంత కాలంగా తనను వేధిస్తున్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు. ‘బూతు మెసేజ్‌లు పంపిన భరించా. సెట్స్‌లో అందరి ముందే నన్ను వేధించేవాడు. ఈ విషయం యూనిట్లో ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఆ తర్వాత అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడు. దీంతో గట్టిగా హెచ్చరించా. నా కూతురి వివాహం ఉండటంతో వ్యవహారం పెద్దది చేసుకోవటం నచ్చక గమ్మున ఉండిపోయా. అయినా అతని తీరు మారలేదు. చివరకు ఫిర్యాదు చేయటంతో నాపై కక్ష గట్టాడు. అవార్డు పంక్షన్ కోసం విదేశాలకు వెళ్లొచ్చేసరికి సీరియల్ నుంచి నన్ను తొలగించి.. ఆ ప్లేస్‌లో వేరే వారిని తీసుకున్నాడు. ఈ విషయంపై అసోషియేషన్‌లో ఫిర్యాదు చేశా. తిరిగి నన్ను తీసుకున్నా అతని వేధింపులు మాత్రం ఆగవు. ఆ విషయం ఖచ్ఛితంగా చెప్పగలను. అతనిపై చర్యలు తీసుకునేదాకా నా పోరాటం ఆగదు’ అని నిషా చెబుతున్నారు. ఇప్పటికే నటి భావన వేధింపుల వ్యవహారం , దీలీప్ సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారాలు ‘అసోషియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్’(అమ్మ-AMMA)ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషా వేధింపుల వ్యవహారం వెలుగులోకి రావటంతో పలువురు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మెగాస్టార్ మమ్ముటీతోపాటు వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యులు నిషాకు మద్ధతు ప్రకటించారు. ఉన్నికృష్ణన్ సీరియస్.. అయితే దర్శకుడు ఉన్నికృష్ణన్ బదులు.. మీడియా హౌజ్‌లో పని చేసే ఉన్నికృష్ణన్ చెన్నంపిల్లి అనే టెక్నీషియన్ పేరును కొన్ని వెబ్సైట్లు ప్రముఖంగా ప్రకటించాయి. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. నిషా చెబుతున్న వ్యక్తి తాను కాదని, తప్పుడు కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. -
సూపర్ స్టార్‌కు విలన్‌గా యంగ్ హీరో
సౌత్ నటులు కూడా హీరో విలన్ అన్న తేడా లేకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు ఈ లిస్ట్‌లో ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే ఆర్య, ఆది లాంటి హీరోలు నెగెటివ్ పాత్రల్లో ఆకట్టుకోగా తాజాగా మరో యంగ్ హీరో కూడా ఈ లిస్ట్‌లో చేరబోతున్నాడు. కోలీవుడ్ హీరోగా నిర్మాతగా నడిగర్ సంఘం నేతగా దూసుకుపోతున్న విశాల్.. తనలోని మరో టాలెంట్‌ను చూపించబోతున్నాడు. ఇన్నాళ్లు యాక్షన్ హీరో ఇమేజ్‌తో ఆకట్టుకున్న విశాల్ త్వరలో సూపర్ స్టార్ సినిమాలో విలన్ పాత్రలో అలరించనున్నాడు. మలయాళ దర్శకుడు ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విశాల్ హీరోగా నటించేందుకు అంగీకరించాడు. ఈ ఇద్దరు హీరోలకు తమ సొంత భాషలతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఒకే సారి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.