
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మహిళల 1500 మీటర్ల విభాగంలో ఆసియా చాంపియన్, భారత రన్నర్ చిత్రా ఉన్నికృష్ణన్ తొలి రౌండ్ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన ఈ హీట్స్‌లో చిత్రా 4 నిమిషాల 11.10 సెకన్లలో గమ్యానికి చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. హీట్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచి సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయింది. గత ఏప్రిల్‌లో ఇదే వేదికపై ఆసియా చాంపియన్íÙప్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గిన చిత్రా అదే ఫలితాన్ని ప్రపంచ చాంపియన్íÙప్‌లో పునరావృతం చేయలేకపోయింది. ఓవరాల్‌గా హీట్స్‌లో 35 మంది పాల్గొనగా చిత్రాకు 30వ స్థానం దక్కింది. టాప్–24లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు చేరుకున్నారు.